telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్ వార్తలు

వేడి నీళ్లతో స్నానం చేస్తే కరోనాకు చెక్ పెట్టవచ్చా!

చైనా లో పుట్టిన కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తోంది. ఇప్పటికే చాలా దేశాలు ఈ వైరస్ కారణంగా కుదేలు అయ్యాయి. ఇక మన దేశంలోనూ ఈ వైరస్ విలయం కొనసాగుతూనే ఉంది.అయితే వేడి నీళ్లతో స్నానం చేస్తే..  కరోనా అంతం అవుతుందని ప్రచారం జోరుగా జరుగుతోంది. అయితే దీనిపై… కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. వేడి నీళ్లతో స్నానం చేస్తే… కరోనా అంతం అవుతుందనే… విషయం తప్పు అని కేంద్రం పేర్కొంది. ప్రయోగశాలలో.. ప్రత్యేక పద్దతులలో..60-70 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద మాత్రమే కరోనా అంతం అవుతుందని చెప్పింది. గొంతు నొప్పి తగ్గించడానికి… వేడి నీళ్లతో ఉప్పు, పసుపు కలిపి పుక్కిలించడం వల్ల ఉపయోగం ఉంటుందని కేంద్రం పేర్కొంది. మాస్క్ ధరించడం, సానిటైజెర్ వాడటం వల్ల కరోనా కు చెక్ పెట్టవచ్చని వెల్లడించింది కేంద్రం.

Related posts