telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ

పొత్తులు : శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు రాజకీయాల్లో ఉండరు …

bjp and bsp alliance will work after result

రాజకీయాలలో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు అంటూ ఎవరు ఉండరు. అందుకే రాజకీయాలలో ఎప్పుడైనా, ఏదైనా, ఎలాగైనా జరుగుతుంది. ఎటు అనుకూలంగా ఉంటె అటువైపు మొగ్గు చూపుతుంటారు. ఇక మే 23 వ తేదీన సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడతాయి. ఆ ఫలితాల తరువాత దేశంలో ఎలాంటి మార్పులు జరగబోతున్నాయి అనేది ఆసక్తికరమైన అంశం. ఎన్నికలు ఎప్పుడు ఎక్కడ జరిగినా… దానిపై ఉత్కంఠ నెలకొంటుంది అంశంలో ఎలాంటి సందేహం లేదు. సార్వత్రిక ఎన్నికలు కావడంతో అభ్యర్థుల విజయంపై అప్పుడే బెట్టింగులు మొదలయ్యాయి. లక్షల నుంచి కోట్ల వరకు బెట్టింగులు జరుగుతున్నాయి.

అభ్యర్థుల బ్యాలెట్ రాతలు ఏమోగానీ, బెట్టింగులు పెట్టేవారి తలరాతలు మారడం ఖాయం. రిజల్ట్ తరువాత కొత్త కొత్త పొత్తులను మనం చూస్తాం. అధికారం చేజిక్కించుకోవడానికి అన్ని పార్టీలు ఇతర పార్టీలకు గాలం వేస్తాయి. ఇప్పటి వరకు చూడని పొత్తులు కొన్ని ఉన్నాయి. అలాంటి వాటిల్లో బీజేపీ… బిఎస్పి పొత్తు ఒకటి. ఉత్తర ప్రదేశ్ లో మాయావతి నేతృత్వంలోని బిఎస్పి… ములాయం సింగ్ యాదవ్ ఎస్పీతోనూ, కాంగ్రెస్ పార్టీతోనూ పొత్తు పెట్టుకొని పోటీ చేసింది. మూడు పార్టీలు కలిసి బీజేపీకి చెక్ పెట్టాలని చూస్తున్నాయి. ఉత్తరప్రదేశ్ లోని లోక్ సభ సీట్ల గెలుపును బట్టి బీజేపీ భవితవ్యం ఆధారపడి ఉంటుంది.

ఎన్నికల రిజల్ట్ తరువాత… మాయావతి పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకుంటుందని కాంగ్రెస్ నేత, బిఎస్పి మాజీ నేత నసీముద్దీన్ సిద్దిఖీ అంటున్నాడు. మాయావతికి ప్రధానమంత్రి కావాలనే ఆశ బలంగా ఉన్నప్పటికీ, అది ఇప్పుడు సాధ్యం కాదని, అందుకే బీజేపీతో పొత్తు పెట్టుకొని ఆ పార్టీకి సహకరించి వీలయితే భవిష్యత్తులో ప్రధానికి కావడానికి రూట్ వేసుకుంటుందని నసీముద్దీన్ చెప్తున్నాడు. మాయావతి బీజేపీకి మద్దతు ఇస్తుందా…!

Related posts