telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

” ప్రాణ వాయువు “గుండెకు అందేనా

పుట్టుకకీ, గిట్టుకకీ మధ్య ప్రాణమై నిలిచావు..

ఉచ్చ్వాస, నిశ్వాసలలో లయగా 

సాగి మనశ్శాంతిని చేకూర్చావు..

కోపమయినా, ఆవేశమయినా గుండె 

వేగంగా కొట్టుకుంటూ,ఊపిరి బంధించేలా చేస్తావు..

కమ్మని గుబాళింపుల సువాసనలు వెదజల్లేలా చేస్తావు..

ప్రకృతికి పరవశం పొందిన వేళ ,

పచ్చని పైరు పలకరిస్తున్న వేళ ,

స్వేదంతో నిండిన కాయానికి ,

అలుపు తీరుస్తున్న సమయాన 

ఒక ఆహ్లాదకర పలకరింపులా,

ఒక మమకారపు స్పర్శలా,

పిల్ల తెమ్మెరలు చుట్టూ చేరగా,

తుషార వీచికలు నను చుట్టుముట్టేయగా,

నీవు నా తోడు ఉండగా, 

నా ప్రాణాన్ని అలా కాపాడగా..

పంచభూతాలు నన్ను నడిపిస్తుండగా 

నేనెలా ఒంటరినౌతాను ?

నీ చల్లని చిరు స్వర్శల కౌగిలిలో బందీని చేశావుగా..!!

నా ముంగురులను తాకి చెవిలో

గుసగుసలు రాగం వినిపించగా..!!

ఏమని చెప్పను నీ మాయ..!! 

నీవు ఖరీదైన ప్రాణ వాయువువి కదా..!! 

నీవు మా చుట్టూ నిండి ఉన్నా,

నీ కోసం పరిగెత్తే రోజులు వచ్చేసాయి కదా..!!

 

Related posts