telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్

ఫోక్సో చట్టం : 9 ఏళ్ళ బాలుడిపై.. 36 ఏళ్ళ మహిళ.. ఏడాదిపాటు..

women abusing child for a year

నిర్లక్ష్యం కోరల్లో, నేరాలు పెరిగిపోతున్నాయి. పసికందులపై అఘాయిత్యాలు జరుగుతున్నాయి. దానికి కఠిన చట్టం తెచ్చినా.. ఇంకా జరుగుతూనే ఉన్నాయంటేనే, దేశంలో చట్టం-న్యాయం పట్ల ఉన్న గౌరవం తెలుస్తూనే ఉంది. ముందు నాయకులకు ఈ విషయాలపై నమ్మకమేలేదు, గౌరవం అసలే లేదు.. నెమ్మదిగా అదేదారిలో అందరూ వెళ్తున్నట్టుగానే ప్రస్తుత నేరాలు బట్టి అబిప్రాయపడాల్సి వస్తుంది.

ఆలస్యంగా వెలుగులోకివచ్చిన ఈ ఘటన మరో ఉదాహరణ : తొమ్మిదేళ్ల బాలుడిపై అత్త వరుసయ్యే 36 ఏళ్ల మహిళ అఘాయిత్యానికి పాల్పడింది. కేరళలోని మలప్పురంలో కలకలం రేపిన ఈ ఘటనకు సంబంధించి పోలీసు అధికారి బినూ థామస్ వెల్లడించారు. ఓ మహిళ కామంతో కళ్లు మూసుకుపోయి, తన లైంగిక వాంఛలు తీర్చుకునేందుకు ఏకంగా ఏడాది పాటు బాలుడిని చిత్ర హింసలు పెట్టింది. బాధిత బాలుడికి అత్త వరుసయ్యే ఆమె, నిత్యమూ మాయమాటలు చెప్పి, తన ఇంటికి తీసుకెళ్లి కామవాంఛ తీర్చుకునేది.

దీనితో చిన్నారి మానసిక పరిస్థితి దెబ్బతినగా, తీవ్ర ఆందోళనతో బాలుడి తల్లిదండ్రులు ఆసుపత్రిలో చేర్చాల్సి వచ్చింది. అక్కడి డాక్టర్ ఆరా తీయడంతో బాలుడు అసలు విషయం చెప్పాడు. ఆ వెంటనే పోలీసులకు, చైల్డ్ లైన్ అధికారులకు ఫిర్యాదు చేయగా, నిందితురాలిపై కఠినమైన ఫోక్సో చట్టం కింద కేసు నమోదైంది. బాలుడికి చికిత్స చేయిస్తున్నామని, కేసును విచారిస్తున్నామని బినూ థామస్ వెల్లడించారు.

ఒకపక్క గుప్పెడు మెతుకుల కోసం అల్లాడే జనాలు, మరోపక్క తిన్నది అరగక మదం ఎక్కి దానిని పసివాళ్లపై కూడా చూపిస్తున్నవారు..ఇదేనా దేశాభివృద్ధి.

Related posts