telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

తిరుపతికి పవన్ కళ్యాణ్.. ఉపఎన్నిక సీటుపై క్లారిటీ వస్తుందా?

pawan

ఏపీ రాజకీయ పార్టీలు ఇప్పుడు తిరుపతి ఉప ఎన్నికలపై పెట్టాయి. ఉప ఎన్నిక నోటిఫికేషన్‌ రాకముందే… ప్రజలకు దగ్గర అవుతున్నాయి పార్టీలు. ఇందులో భాగంగానే ఇప్పటికే వైసీపీ, తెలుగుదేశం పార్టీలు అభ్యర్థులను ప్రకటించేశాయి. అటు బీజేపీ కూడా పోటీకి సిద్ధమని తెలిపింది. ఈ నేపథ‌్యంలో జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ తిరుపతి వెళ్లనున్నారు. జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఈనెల 21న తిరుపతిలో భేటీ కానుంది. ఈ నేపథ్యంలోనే జనసేనాని తిరుపతికి పయనం కానున్నారు. ఈ భేటీలో జనసేన అధ్యక్షుడు పవన్‌తో పాటు పార్టీ వ్యవహారాల కమిటీ చైర్మన్‌ నాదేండ్ల మనోహర్‌ పాల్గొననున్నారు. ఈ సమావేశంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, తిరుపతి ఉప ఎన్నికకు సంబంధించిన కీలక విషయాలను చర్చించబోతున్నట్లుగా పార్టీ నాయకత్వం ద్వారా సమాచారం అందుతోంది. తిరుపతి ఉప ఎన్నికకు రోజులు దగ్గర పడుతున్న సమయంలో బీజేపీతో పొత్తు కారణంగా సీటు వారికి వదిలి పెట్టాలా లేదంటే జనసేన అభ్యర్థిని పోటీకి దించాలా అనే విషయాన్ని ఈ సమావేశంలో చర్చిస్తారని కూడా సమాచారం అందుతోంది. మొత్తానికి ఈ సమావేశంలో పార్టీ భవిష్యత్తు ప్రణాళికను సిద్ధం చేయబోతున్నారు. పార్టీని మరింత బలోపేతం చేయడం కోసం కింది స్థాయి కార్యకర్లను ఎలా సిద్ధం చేయాలనే దానిపై కూడా చర్చ జరుగనుంది.

Related posts