ఈ రోజు తెల్లవారుజామున దిశ హంతకులను సీన్ రీకన్ స్ట్రక్షన్ కోసం తీసుకు వెళ్లిన సమయంలో వారు పోలీసులపై రాళ్ల దాడి చేసి పారిపోతుంటే, ఎన్ కౌంటర్ చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఇద్దరు పోలీసులకూ గాయాలు అయ్యాయి. దిశను కాల్చిన చోటు నుంచి పరుగు ప్రారంభించిన నలుగురు నిందితులూ, అక్కడ దొరికిన రాళ్లను పోలీసులపైకి విసురుతూ పారిపోయేందుకు ప్రయత్నించారని ఓ పోలీసు అధికారి తెలిపారు.వారు
నలుగురు నిందితులూ విసిరిన రాళ్లలో కొన్ని పోలీసులకూ తగిలాయని, గాయపడిన ఇద్దరిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించామని తెలిపారు. లొంగిపోవాలని చేసిన హెచ్చరికలను వారు పట్టించుకోనందుకే ఎన్ కౌంటర్ చేయాల్సి వచ్చిందని పోలీసులు వెల్లడించారు.
నేనేమీ టీడీపీకి ద్రోహం చేయలేదు: అంబికా కృష్ణ