telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

రాజా సింగ్‌ కు ఏడాది జైలు శిక్ష విధించిన నాంప‌ల్లి ప్ర‌త్యేక న్యాయ‌స్థానం…

బీఫ్ ఫెస్టివల్ వ్యవహారంలో రాజా సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ కేసును విచారించిన నాంప‌ల్లి ప్ర‌త్యేక న్యాయ‌స్థానం ఆయనకు ఏడాది  జైలు విధించింది. ఆయనకు అనంతరం బెయిల్ కూడా మంజూరు చేసింది. 2015వ సంవత్సరంలో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో కొందరు విద్యార్ధులు బీఫ్ ఫెస్టివల్ చేసుకొబోతున్నారనే వార్తలపై రాజా సింగ్ చాలా తీవ్రంగా స్పందించారు. బీఫ్ ఫెస్టివల్ చేసుకున్నట్లయితే నా తడాఖా చూపిస్తాను. దాద్రీ సంఘటనలు హైదరాబాద్ లో కూడా చూడవలసి వస్తుంది,” అని హెచ్చరించారు. బీఫ్ ఫెస్టివల్ నేపధ్యంలో రాజా సింగ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. రాజా సింగ్ ను అరెస్ట్ చేసి బొల్లారం పీఎస్ కు తరలించగా బొల్లారం పీఎస్ లో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు రాజా సింగ్. ఉస్మానియా లో బీఫ్ ఫెస్టివల్ చేస్తే… మరో దాద్రి అవుతుందని రాజా సింగ్ అన్నారు. దీంతో జ్ సింగ్ పై సెక్షన్ 295 A కింద కేసు నమోదు చేశారు బొల్లారం పోలీసులు. ఐదేళ్ల తర్వాత ఈ కేసులో ఏడాది జైలు శిక్ష అంటూ తీర్పు ప్రకటించింది నాంపల్లి కోర్టు. నాంపల్లి కోర్టు ఇచ్చిన తీర్పు పై రాజా సింగ్ బెయిల్ పిటీషన్ దాఖలు చేయడంతో వెంటనే బెయిల్ మంజూరు చేసింది నాంపల్లి కోర్టు.

Related posts