telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సినిమా వార్తలు

మొత్తానికి డేట్ దొరికిందోచ్ .. అంటున్న ‘అర్జున్ సురవరం’ …

nikhil on suravaram movie release

గత కొద్దీ నెలలుగా విడుదలకు నోచుకోకుండా ఉండిపోయిన ‘అర్జున్ సురవరం’ మొత్తానికి బయటపడినట్టే ఉంది. ఈ చిత్రంలో యంగ్ హీరో నిఖిల్ , లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలలో నటించారు. ఇప్పటివరకు అదిగో ఇదిగో అంటున్నారే తప్ప సినిమా మాత్రం రిలీజ్ కావడం లేదు. ఈ సినిమా రిలీజ్ కాదని అంత ఫిక్స్ అవుతున్న నేపథ్యంలో నిఖిల్ ఈ సినిమా రిలీజ్ అప్డేట్ ఇచ్చి మరోసారి ఈ సినిమా గురించి మాట్లాడుకునేలా చేశాడు.

ఇన్నాళ్లు మిమల్ని వెయిట్ చేయించానని తెలుసు.. ఓపికగా ఎదురుచూసినందుకు థాంక్స్ అంటూ అభిమానుల్ని ఉద్దేశించి ట్వీట్ చేశాడు. మరి ఆ కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడు రివీల్ చేస్తారో చూడాలి. టి.సంతోష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను బి.మధు సమర్పణలో మూవీ డైనమిక్స్ ఎల్ఎల్‌పీ, ఔరా సినిమాస్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ల పై రాజ్ కుమార్ ఆకెళ్ల, కావ్య వేణుగోపాల్ నిర్మించారు.

Related posts