telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

ఈ రోజు తేలనున్న బీహార్ ఎన్నికల ఫలితాలు…

ఈ రోజు బీహార్ ఎన్నికల ఫలితాలు తేలనున్నాయి. ఆర్‌జేడీ, ఎన్‌డీఏ  తదితర పార్టీల మధ్య పోటీ హారాహోరీగా సాగుతున్న విషయం తెలిసిందే. అయితే బీహార్ తన మూడో  విడత పోలింగ్ ఇటీవల 7వ తారీకున ముగించుకుంది. ఈ రోజు ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపులు మొదలుకానున్నాయి. అందులో ఎవరు గెలవనున్నారా అని వేచిచూడాలి. ఈ లెక్కింపులు ఈ రోజు అనగా నవంబరు 10 ఉదయం 8 గంటలకు మొదలు కానున్నాయి. అయితే ఈ లెక్కింపుల కోసం మొత్తం 55 లెక్కింపు కేంద్రాలను 38 జిల్లాలలో ఎన్నికల కమిషన్ నిర్మించింది. ఈ ఎన్నికలు 3,755 మంది అభ్యర్థుల భవిష్యత్తు తేలనుంది. దానికి తోడుగా ఈ ఎన్నికల ఫలితాలను ప్రతి ఒక్కరు ఓటర్ హెల్ప్‌లైన్ అనే అప్లికేషన్ ద్వారా తెలుసుకోవచ్చు. అంతేకాకుండా బీహార్‌ తన పేరుపై ఓ కొత్త రికార్డును సృష్టించింది. కరోనా వైరస్ మహమ్మారి దేశంలో ప్రవేశించాక జరిగిన మొట్టమొదటి ఎన్నికలుగా, అంతేకాకుండా పూర్తిగా జరిగిన ఎన్నికలుగా రికార్డు చేశాయి. కొందరి ఆలోచనల ప్రకారం ఈ సారి ఎన్నికల్లో మహాఘట్‌బందన్ 116-138 సీట్లను గెలుస్తుందని, ఎన్‌డీఏ కేవలం 61-91 సీట్లను, ఎల్‌జేపీ 2-3 సీట్లను సొంతం చేసుకుంటాయని తెలుపుతున్నారు.

Related posts