విశాఖలోని హిందూస్థాన్ షిప్ యార్డులో క్రేన్ ప్రమాదంలో 11 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు ప్రభుత్వం నష్ట పరిహారం ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రూ.50 లక్షల చొప్పున అందజేయనున్నట్టు మంత్రి అవంతి శ్రీనివాస్ వెల్లడించారు.
హిందూస్థాన్యా జమాన్యం ప్రతినిధులతో మంత్రి అవంతి నష్టపరిహారంపై మాట్లాడారు. అధికారులు, కార్మికులతోనూ ఆయన చర్చించారు. పర్మినెంటు ఉద్యోగుల కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, కాంట్రాక్టు కార్మికుల కుటుంబాల్లో ఒకరికి కాంట్రాక్టు సంస్థల్లో శాశ్వత ఉపాధి కల్పించనున్నట్టు అవంతి వివరించారు. హిందూస్థాన్ షిప్ యార్డు లిమిటెడ్ ద్వారా అదనపు సౌకర్యాలు కల్పిస్తారని తెలిపారు.
అమరావతి రాజధానిని జగన్ అప్పట్లో ఆమోదించారు: సీపీఐ నారాయణ