ఓ వ్యక్తి ఎండకు తట్టుకోలేక స్నేహితుడితో మాట్లాడుతూ స్ట్రీట్ లైట్ కిందికి వెళ్తే అది అతడి తలపై పడి మరణించిన ఘటన హైదరాబాద్ శివారులోని దమ్మాయిగూడ సాయిబాబానగర్‌లో జరిగింది. స్థానికంగా నివసించే కాముని కిష్టయ్య(50) ఈ నెల 12న మధ్యాహ్నం అంబేద్కర్ నగర్‌లోని జగదాంబ జువెల్లర్స్ సమీపంలో తన స్నేహితుడిని కలిసి మాట్లాడుతున్నాడు. ఎండ తీవ్రంగా ఉండడంతో పక్కనే ఉన్న స్ట్రీట్ లైట్ నీడలోకి వెళ్లారు.
అకస్మాత్తుగా స్ట్రీట్ లైట్ ఇద్దరూ మాట్లాడుకుంటుండగా ఊడి కిష్టయ్య తలపై పడింది. తీవ్రంగా గాయపడిన ఆయనను స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. కిష్టయ్య కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.