telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నిర్భయ, దిశ ఘటనల ఆధారంగా చిత్రం… : రామ్ గోపాల్ వర్మ

Ram-Gopal-Varma

వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ ఎప్పుడూ ఏదో ఒక హాట్ టాపిక్ తో వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా నిర్భయ, దిశ ఘటనల ఆధారంగా ‘దిశ’ చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు ట్విట్టర్‌ వేదికగా ప్రకటించారు. దిశ నిందితుల్లో ఒకరైన చెన్నకేశవులు భార్య రేణుకతో మాట్లాడుతున్న ఫొటోను ఆయన ట్వీట్‌ చేశారు. ఇంకా వర్మ మాట్లాడుతూ “దిశను రేపిస్టులు ఎందుకు చంపారు? వాళ్ల ఆలోచనా విధానం ఏమిటి? అనేది చిత్రంలో చూపించబోతున్నా. నిర్భయ రేపిస్టులు అమ్మాయిని ఊపిరితో వదిలేయడంతో పోలీసులు వాళ్లను పట్టుకోగలిగారు. అటువంటి తప్పును దిశ రేపిస్టులు చేయాలనుకోలేదు. అందుకని, పెట్రోల్‌ పోసి అమ్మాయిని తగలబెట్టారు. రేపిస్టులు గతంలో పట్టుబడిన వారి తప్పులు నుండి పాఠాలు నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు తప్ప అత్యాచారాలను ఆపేయాలని అనుకోవడం లేదు. ‘దిశ’ చిత్రం మనందరిని భయపెట్టే పాఠం అవుతుంది. మన దేశంలో సంవత్సరాలుగా ఏపీ సింగ్‌ (నిర్భయ దోషుల తరపున వ్యాదిస్తున్న న్యాయవాది) వంటి న్యాయవాదులు మన కోర్టులతో ఎలా ఫుట్‌బాల్‌ ఆడుకుంటున్నారనే నిజాన్ని ‘దిశ’ సినిమా రేప్‌ చేస్తుంది. నేను రేణుకను కలిశా. చెన్నకేశవులను 16 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకుంది. 17 ఏళ్ల వయసులో ఓ బిడ్డకు జన్మ ఇవ్వబోతోంది. దిశను మాత్రమే కాదు… సొంత భార్యనూ చెన్నకేశవులు బాధితురాల్ని చేశాడు. అమ్మాయికి, పుట్టబోయే బిడ్డకు భవిష్యత్తు లేకుండా చేశాడు’’ అన్నారు.

Related posts