telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

20 ఏళ్ళ తరువాత… అదే బికినిలో… అంతే అందంగా…!?

Gul

సాధారణంగా నటీమణులు పెళ్ళైన తరువాత వెయిట్ పెరిగినా పెద్దగా పట్టించుకోరు. కానీ నాలుగు పదుల వయసులోనూ అంతే సెక్సీగా ఉన్నారు బాలీవుడ్ నటి గుల్ పనాగ్. ఓ పిల్లాడికి తల్లి. అయితే ఆమె బాలీవుడ్ కెరీర్ అంత సక్సెస్‌ఫుల్‌గా లేదు. 2003లో ధూప్ అనే సినిమాతో బాలీవుడ్‌లో అడుగుపెట్టిన గుల్‌కు చెప్పుకోదగ్గ అవకాశాలు రాలేదు. ఆమె ఎంత ఫిట్‌గా ఉన్నా 40 ఏళ్ల వయసులో తల్లి పాత్రలు, అక్క పాత్రలు మాత్రమే వస్తాయి. అందుకే ఆమె రాజకీయాల్లోకి వెళ్లాలనుకున్నారు. 2014లో తన స్వస్థలం అయిన చండీగఢ్ నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేశారు. తాజాగా ఆమె తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఫొటోను పోస్ట్ చేశారు. 1999లో మాల్దీవ్స్‌లో బికినీ వేసుకుని దిగిన ఫొటోను. ఇటీవల అదే ప్రదేశంలో అదే బికినీ వేసుకుని దిగిన ఫొటోను జత చేసి ఇన్‌స్టా్గ్రామ్‌లో పోస్ట్ చేశారు. “20 ఏళ్ల త్వాత మళ్లీ మాల్దీవ్స్‌కి వచ్చాను. ఇప్పటికీ నా మార్క్స్ అండ్ స్పెన్సర్ బికినీ ఏమాత్రం పాడవలేదు” అని క్యాప్షన్‌లో పేర్కొన్నారు. ఈ ఫొటో చూస్తే అప్పటికి ఇప్పటికి ఆమెలో ఏ మార్పూ లేదు. ఇప్పటికీ అంతే సెక్సీగా, అందంగా ఉన్నారంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Related posts