నేడు (సెప్టెంబర్5) ఉపాధ్యాయ దినోత్సవం. ఈ సందర్భంగా పలువురు తమ జీవితంలో కీలక పాత్ర పోషించిన గురువులను గుర్తుచేసుకుంటున్నారు. తాజాగా సూపర్ స్టార్ మహేశ్ బాబు తన మొదటి గురువు, తండ్రి సూపర్ స్టార్ కృష్ణతో కలిసి దిగిన చిన్ననాటి ఫోటోను షేర్ చేస్తూ.. ‘ప్రేమ, ఆప్యాయతలు దయాగుణం, క్రమశిక్షణ, వినయం, పరిస్థితుల్లో బలంగా ఉండటం వంటి ఎన్నో మంచి విషయాలు నేర్పించిన నాన్నకి ధన్యవాదాలు. ఆయనతో పాటు ఈ ప్రయాణంలో నా అభివృద్ధికి సహాయం చేసిన ప్రతి ఒక్కరికీ ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను. హ్యాపీ టీచర్స్ డే’ అంటూ మహేశ్ ట్వీట్ చేశారు.
ప్రస్తుతం మహేశ్ ‘సర్కారు వారి పాట’ సినిమాలో నటిస్తున్నాడు. ఇందులో కీర్తి సురేశ్ హీరోయిన్‌గా నటిస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్, 14 రీల్స్ ప్లస్ పతాకాల రూపొందుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 13న విడుదల కానుంది.