telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్ వార్తలు

సన్ స్క్రీన్ లోషన్ .. జాగర్త !

using sunscreen lotion should be careful

వాతావరణ కాలుష్యం తో ఓజోన్ పోర దెబ్బతినడంతో ప్రమాదకరమైన కాంతి కిరణాలు భూమిపై ప్రసరిస్తున్నాయి. దీనితో భూమిపైకి ప్రసారమయ్యే అతినీలలోహిత, పరారుణ కిరణాలు మన శరీరానికి హాని కలుగుతుందన్న విషయం అందరికీ తెలిసిందే. వీటి వల్ల చర్మ సమస్యలు వస్తాయి. చర్మ క్యాన్సర్ కూడా వచ్చేందుకు ఎక్కువగా అవకాశం ఉంటుంది.

సన్‌స్క్రీన్ లోషన్లలో మనకు ఎస్‌పీఎఫ్ 15 నుంచి ఎస్‌పీఎఫ్ 50 ప్లస్ వరకు రక్షణనిచ్చే రకరకాల లోషన్లు మనకు అందుబాటులో ఉన్నాయి. ఎస్‌పీఎఫ్ ఎంత ఎక్కువ ఉంటే మన చర్మానికి అంత రక్షణ లభిస్తుంది. ఈ క్రమంలోనే ఎస్‌పీఎఫ్ 15 ఉన్న సన్‌స్క్రీన్ లోషన్ రాసుకుంటే సూర్యకాంతితోపాటు 93 శాతం వరకు కిరణాల నుంచి రక్షణ లభిస్తుంది.

ఎస్‌పీఎఫ్ 30 అయితే 97 శాతం వరకు, ఎస్‌పీఎఫ్ 50 ఉన్న లోషన్ అయితే 98 శాతం వరకు, ఎస్‌పీఎఫ్ 50 ప్లస్ ఉన్న లోషన్ అయితే 100 శాతం మనకు అతినీలలోహిత, పరారుణ కిరణాల నుంచి రక్షణ అందిస్తాయి.

ఈ క్రమంలోనే నిత్యం 5 గంటల కన్నా ఎక్కువ సమయం పాటు ఎండలో ఉండేవారు ఎస్‌పీఎఫ్ 50 ప్లస్ ఉన్న లోషన్ వాడాలని వైద్యులు సూచిస్తున్నారు.

Related posts