telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం.. కాలంతీరిన మందుతో చిన్నారికి వైద్యం!

ప్రాథమిక వైద్యం కోసం తెలంగాణ ప్రభుత్వం ఎన్నో నిధులు వెచ్చించి ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలు మెరుగు పరుస్తున్నప్పటికీ కొందరు వైద్యులు వీధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్నారు. ములుగు జిల్లా వాడెగూడెంకు చెందిన 9 నెలల చిన్నారికి ఈనెల 19న విరేచనాలు కావడంతో ములుగు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువెళ్లారు.

అక్కడ డాక్టర్ బాబును చూసి విరేచనాలు తగ్గడానికి సిరప్ ఇచ్చారు. అయితే అది కాలంతీరిన మందు కావడంతో బాబుకు విరేచనాలు తగ్గకపోగా ఎక్కువయ్యాయి. మరుసటి రోజు సిరప్ బాటిల్‌పై కాలంతీరిన తేదీని గమనించి వెంటనే డాక్టర్ వద్దకు వెళ్లారు. కాలంతీరిన మందు ఇచ్చినందుకు డాక్టర్‌ను స్థానికులు నిలదీయడంతో ఆయన తన తప్పును అంగీకరించారు.

Related posts