telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

మూడ్నెల్ల విద్యుత్ బిల్లులను ప్రభుత్వమే చెల్లించాలి: గంటా

Ganta srinivas tdp

ఏపీలో విద్యుత్ బిల్లులు అధికంగా వస్తున్నాయని విపక్షాలు తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా విద్యుత్ బిల్లులపై మాజీ మంత్రి, టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు స్పందించారు.సీఎం జగన్ తీసుకువచ్చిన డైనమిక్ విధానం వల్ల విద్యుత్ బిల్లులు ఒక్కసారిగా పెరిగిపోయాయని అన్నారు.

మూడు నెలల విద్యుత్ బిల్లులను ప్రభుత్వమే చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. విపత్తు నిర్వహణ నిధుల నుంచి ప్రజలను ఆదుకునే ఆలోచన చేయాలని గంటా ఏపీ ప్రభుత్వానికి సూచించారు.రాష్ట్రంలో లాక్ డౌన్ నేపథ్యంలో అసలే రెండు నెలలుగా ఉపాధి లేక, ఆదాయం రాక సగటు ఆంధ్రా పౌరుడు బిల్లు చెల్లించలేని పరిస్థితుల్లో విలవిల్లాడుతున్నాడని వివరించారు. సగటు వినియోగదారుడిగా ఒక్కసారి ప్రజల బాధను ఆలకించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

Related posts