telugu navyamedia
ఆంధ్ర వార్తలు

విద్యాశాఖ మంత్రికి కృతజ్ఞతలు తెలిపిన ట్రస్మా

sabitha indra reddy

విద్యాశాఖ మంత్రికి కృతజ్ఞతలు తెలిపిన ట్రస్మా, పాత్రికేయ మిత్రులకు నమస్కారం.

ఈరోజు ట్రస్మా రాష్ట్ర నాయకులు యాదగిరి శేఖర్ రావు ట్రస్మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాదుల మధుసూదన్ నాయకత్వంలోని బృందం హైదరాబాదులోని విద్యాశాఖ మంత్రి శ్రీమతి సబితా ఇంద్రా రెడ్డి గారి నివాసంలో కలిసి బడుల పునః ప్రారంభానికి కృషి చేసినందుకు మరియు పదవ తరగతి పరీక్ష ఫీజు గడువును పెంచినందుకు పుష్పగుచ్చం అందించి కృతజ్ఞతలు తెలియజేశారు.

మంత్రి మాట్లాడుతూ పాఠశాలలలో కోవిడ్ నియమ నిబంధనలను తూ.చా తప్పకుండా పాటించాలని, ఎటువంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా చూడాలని కోరారు.

శానిటేషన్, సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు కరొన నుండి స్వీయరక్షణ సూచనలను తెలియజేయాలని ఆమె సూచించారు

విద్యార్థులకు జరుగుతున్న విద్యా నష్టాన్ని పూరించటానికి ప్రస్తుత విద్యా విధానంలో అవలంబించాల్సిన పద్ధతులు, రీడింగ్ , రైటింగ్ అభివృద్ధిపై పలు సూచనలు చేశారు.

పదవ తరగతి విద్యార్థుల పై ప్రత్యేక శ్రద్ధ వహించి సిలబస్ త్వరితగతిన పూర్తి చేసి ఉత్తమ ఫలితాలు సాధించే దిశగా విద్యార్థులను సిద్ధం చేయాలని ఆమె సూచించారు.

ట్రస్మా రాష్ట్ర నాయకులు యాదగిరి శేఖర్ రావు మాట్లాడుతూ సిలబస్ లు పూర్తి కానందున ఈ విద్యా సంవత్సరాన్ని మే నెలాఖరు వరకు పొడిగించాలని ఆయన మంత్రికి విజ్ఞప్తి చేశారు.

పదో తరగతి పరీక్ష ఫీజు సమయం వెలువడినందున , ఈ టి ఆర్ లు పెండింగ్లో ఉన్న పాఠశాలల ఫైల్ లను త్వరితగతిన పూర్తి చేయాలని, అట్టి పాఠశాలల పదవ తరగతి విద్యార్థుల పరీక్ష రుసుములను, నామినల్ రోల్స్ ను స్వీకరించే విధంగా చూడాలని ఆయన మంత్రి గారికి విన్నవించారు.

ట్రస్మా విన్నవించిన సమస్యలను సావధానంగా విన్న విద్యాశాఖ మంత్రి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులతో పాటు హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు ఉమామహేశ్వర రావు , మేడ్చల్ జిల్లా అధ్యక్షులు శివరాత్రి యాదగిరి, హైదరాబాద్ అసోసియేట్ అధ్యక్షులు కృష్ణప్రసాద్, హైదరాబాద్ కోశాధికారి రఘు, సికింద్రాబాద్ అధ్యక్షులు పవన్, రాష్ట్ర బాధ్యులు అల్తాఫ్ హుస్సేన్, కరస్పాండెంట్ లు సోమశేఖర్, శివరామకృష్ణ, , శ్రీను తదితరులు మంత్రికి కృతజ్ఞతలు తెలియ చేసిన వారిలో ఉన్నారు.

 

Related posts