ప్రభుత్వంపై కొన్ని పత్రికలు, చానళ్లు దుష్ప్రచారం చేస్తున్నాయని ఏపీ మంత్రి మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సీఎం జగన్ అధికారంలోకి వచ్చి ఏడు నెలల కాలంలోనే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను చేస్తోందని ప్రశంసించారు.
ప్రభుత్వం మంచి కార్యక్రమాలు చేస్తున్న కొన్ని ఛానెల్స్ దుష్ప్రచారం చేస్తున్నాయని ‘ఈనాడు’, ఏబీఎన్ ఛానెల్’పై మండిపడ్డారు. ‘అమ్మ ఒడి’పై ప్రభుత్వం ఇచ్చిన యాడ్ ఇదే పత్రికలో ఉందని, ఆ పత్రికలోనే ‘శ్రీమాన్ రామోజీరావు గారి తాలూకా స్వార్థం.. రామోజీరావుగారి తాలూకా సమాజ స్ఫూర్తి కాదు సామాజిక స్ఫూర్తి కార్యక్రమం కనిపిస్తుంది’ అంటూ ఆ పత్రికలో వెలువడ్ద కథనాన్ని మంత్రి చూపించారు.
సోనియా తెలంగాణ ఇవ్వకుంటే నువ్వు సీఎం అయ్యేవాడివా?