జాతీయంగా కూటముల ప్రాముఖ్యత పెరిగింది. అయితే ఇదంతా ఓటర్లను దారి మళ్లించడానికే తప్ప మరొకటి కాదనేది తెలుస్తుంది. దానికి నిదర్శనంగా, బీజేపీ కి దూరంగా ఉంటున్నట్టు తెలంగాణ ప్రభుత్వం తెరవెనుక ఆ పార్టీతో ప్రణాళికలు సాగిస్తూనే ఉంది. ఇది తెలియకుండా ఉండేందుకు ఫెడరల్ ఫ్రంట్ అంటూ తెరపైకి తెచ్చి, ఓటర్ ను దారిమళ్లిస్తున్నారు. మరో కూటమి, కాంగ్రెస్ ఏర్పాటు చేసిన మహా కూటమి.. ఇది కూడా ఆ పార్టీ ఏర్పాటు చేసినంత వరకు బాగానే ఉందికానీ, ప్రధాని అభ్యర్థిత్వానికి వచ్చేసరికి ఇబ్బందులు వచ్చేశాయి, ఇది మొదటిది; రెండవదిగా చెప్పాలంటే టీడీపీ జాతీయంగా కాంగ్రెస్ తో కలిసి పనిచేయడానికి ముందుకు రావడం. ఈ రెండింటితో బీజేపీ తన వ్యూహాన్ని చక్కగా ముందుకు తీసుకెళ్తుంది. ఇంతకాలం అధికారం అంటే ఓటర్లు ఓట్లు వేసి అభ్యర్థులను ఎన్నుకుంటారు.. కానీ ప్రస్తుత ట్రెండ్ లో ఆయా పార్టీలు వ్యూహరచనలు చేసి, వారికి తగ్గట్టుగా ఓట్లు పడేట్టుగా ఓటర్ ను దారి మళ్లిస్తున్నాయి. ఇప్పుడు దేశరాజకీయాలలో అదే జరుగుతుంది. టీడీపీ-కాంగ్రెస్ తో కలవడం తెరపైకి మాత్రమే, అది కూడా బీజేపీ వ్యూహంలో ఒకటి, ఇక కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ కూడా అంతే.
ఇక, మహా కూటమికి నలుగురు ప్రధాన మంత్రి అభ్యర్థులు ఉన్నారని, వారిలో ఒకరు మమతా బెనర్జీ కాగా, మిగిలిన ముగ్గురూ మాయావతి, రాహుల్ గాంధీ, కేసీఆర్ అని కేంద్ర మంత్రి అంతటివారే ప్రచారం చేస్తున్నారు. ”ప్రతిపక్షాలు ద్విముఖ వ్యూహంతో సాగుతున్నాయి. ఒకటి, ప్రతికూల మోదీ వ్యతిరేక అజెండా. రెండోది, ఎక్కువ పార్టీలు కలిసి పోటీ చేయడం ద్వారా ఎన్నికల అర్థమెటిక్‌లో గరిష్ఠ లబ్ధి పొందడం. ప్రతిపక్షాలన్నీ కలుస్తున్నాయంటేనే ప్రధాని పట్ల సంతృప్తి గరిష్ఠస్థాయిలో ఉందనడానికి సంకేతం అంటూ ఆ మంత్రి అభిప్రాయపడుతున్నారు.
బీజేపీ-కాంగ్రెస్ యేతర ప్రభుత్వం కోసం కేసీఆర్ ప్రయత్నిస్తున్నాడు. ఇతర పార్టీలు అన్ని బీజేపీ యేతర ప్రభుత్వం కోసం కూటమిగా ఏర్పటు అవుతున్నాయి. మరి ఈ రెంటిని ఒకతాటిపైకి తేవడం ఏంటి.. ఈ వ్యూహం ఎవరిది!!
ఆనాడు లోక్ సభలో అవిశ్వాస తీర్మానం.. ఈనాడు మోదీకి పాదాభివందనం!