నేనే రాజు నేనే మంత్రి, ఇద్దరమ్మాయిలతో, సరైనోడు వంటి చిత్రాలతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ కేథరిన్ ట్రెసా. తెలుగులో చాలా చిత్రాల్లో నటించినా ఇప్పటి వరకు సరైన గుర్తింపు లభించలేదు. మరోవైపు కోలీవుడ్‌లో మాత్రం చేతినిండా సినిమాలతో స్టార్ హీరోయిన్ ఇమేజ్‌ను దక్కించుకున్నారు. తాజాగా ఆమె గురించి ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా తాను ఓ వ్యాధితో బాధపడుతున్నట్టు కేథరిన్ స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అనోస్మియ అనే వ్యాధితో తాను బాధపడుతున్నానని తెలిపారు. ఆ వ్యాధితో బాధపడుతున్నవారు వాసన చూడలేరని.. సువాసన అయినా.. దుర్వాసన అయినా పసిగట్టలేరని చెప్పారు. ప్రస్తుతం తాను కూడా ఎలాంటి వాసనను పసిగట్టలేకపోతున్నానని, కొంతకాలంగా ఈ సమస్య వెంటాడుతోందని చెప్పారు.లక్ష మందిలో ఒకరికి మాత్రమే ఉండే ఈ అరుదైన వ్యాధి గురించి ఇప్పటివరకు ఎవరికీ చెప్పలేదన్నారు. ఈ సమస్య కారణంగా భవిష్యత్‌లో పెళ్లికి కూడా దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు. ప్రస్తుతం సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ సరసన “వరల్డ్ ఫేమస్ లవర్” అనే చిత్రంలో కేథరిన్ నటిస్తున్నారు.