telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

తెలంగాణ రాష్ట్ర స‌ర్కార్‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన హై కోర్టు…

తెలంగాణ రాష్ట్ర స‌ర్కార్‌పై విరుచుకుప‌డింది హైకోర్టు. మీరు చెప్పేది ఒక‌టి చేసి మ‌రోటి అంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది.. కోవిడ్ క‌ట్ట‌డి చ‌ర్య‌ల్లో భాగంగా.. నైట్ క‌ర్ఫ్యూతో పాటు.. స‌మావేశాల‌కు, ప్ర‌జ‌లు గుమ్మిగూడె అవ‌కాశం ఉన్న అన్ని కార్య‌క్ర‌మాల‌కు అనుమ‌తిని 50 శాతానికి కుదించాల‌ని స్ప‌ష్టం చేసింది.. కోవిడ్ బాధితుల మృత‌దేహాల త‌ర‌లింపుపై కూడా కీల‌క వ్యాఖ్య‌లు చేసింది హైకోర్టు.. అంబులెన్స్‌లు అందుబాటులే లేక‌పోతే.. మృత‌దేహాల‌ను త‌ర‌లించ‌డానికి గుర్రాల‌ను వాడాల‌ని స‌ల‌హా ఇచ్చింది.. కోవిడ్ కంట్రోల్ రూమ్ కోసం మ‌రిన్ని టోల్ ఫ్రీ నెంబ‌ర్ల‌ను అందుబాటులోకి తేవాల‌ని పేర్కొంది. ఇక‌, సోష‌ల్ డిస్టెన్స్ పాలించ‌క పోవ‌డంపై రాష్ట్రవ్యాప్తంగా 4 కేసులు.. పెద్ద ఎత్తున గుమ్మిగూడ‌టంపై రెండు కేసులు మాత్ర‌మే న‌మోదు చేయ‌డంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది హైకోర్టు… మున్సిప‌ల్ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో ఎలాంటి ప్ర‌ణాళిక‌లు లేక‌పోవ‌డంపై ఎస్ ఈ సీపై హైకోర్టు అస‌హ‌నం వ్య‌క్తం చేసింది.. ఎలాంటి చ‌ర్య‌లు తీసుకుంటున్నారో వివ‌రించాల‌ని ఎల‌క్ష‌న్ క‌మిష‌న్‌కు ఆదేశాలు జారీ చేసింది.. నైట్ క‌ర్ఫ్యూ మాత్ర‌మే కాకుండా స‌మావేశాల‌కు, అన్ని గ్యాద‌రింగుల‌కు 50శాతానికి మించ‌కూడ‌ద‌న్న హైకోర్టు.. 108, 104కు వ‌స్తున్న ఫోన్ కాల్స్ కోవిడ్ తీవ్ర‌త‌కు అద్దం ప‌డుతోంద‌ని.. మ‌రినొన్ని టోల్ ఫ్రీ నంబ‌ర్లు ఏర్పాటు చేయాల‌ని సూచించింది. ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులు అన్నీ ఆర్టీపీసీఆర్ టెస్టు ఫలితాల కోసం వేచిచూడకుండా వైద్యం అందించాలన్న హైకోర్టు.. వాయు మార్గాలను ఆక్సిజన్ రవాణాకు సిద్ధంగా ఉంచాలని భారత వాయుసేనను కోరింది.

Related posts