telugu navyamedia
క్రీడలు వార్తలు

భారత్ కు విరాళం ప్రకటించిన మరో ఆసీస్ క్రికెటర్…

భారత్‌కు ఆసీస్ స్టార్ పేసర్, కోల్‌కతా నైట్‌రైడర్స్ ప్లేయర్ కమిన్స్ భారత్ కోసం 50 వేల డాలర్ల విరాళం ప్రకటించగా.. నేడు అతని సీనియర్ ప్లేయర్, దిగ్గజ పేసర్ బ్రెట్ లీ సాయం చేసేందుకు ముందుకొచ్చాడు. కరోనా మహమ్మారితో యుద్ధం చేస్తున్న భారత్ కు ఒక బిట్ కాయిన్ విరాళంగా ఇస్తున్నట్టు బ్రెట్ లీ ప్రకటించాడు. ప్రస్తుత మార్కెట్ ప్రకారం ఒక బిట్ కాయిన్‌కు భారత కరెన్సీలో రూ.40.95 లక్షల విలువ ఉంది. తన విరాళం గురించి బ్రెట్ లీ సోషల్ మీడియా వేదికగా ఓ ప్రకటన చేశాడు. భారత్ తనకు రెండో ఇల్లని, ఇక్కడి ప్రజలు చూపించి ప్రేమ, ఆప్యాయతలు తన మదిలో పదిలంగా ఉంటాయని పేర్కొన్నాడు. ‘నాకు భారత్ రెండో ఇల్లులాంటిది. నేను క్రికెటర్‌గా ఉన్నప్పుడు, రిటైర్ అయిన తర్వాత కూడా ఇక్కడి ప్రజలు చూపించిన ప్రేమ, ఆప్యాయతలకు నా హృదయంలో ప్రత్యేక స్థానం ఉంటుంది. ప్రస్తుతం మహమ్మారి ధాటికి భారత ప్రజలు అల్లాడుతున్న తీరు తీవ్ర విచారం కలిగిస్తోంది.

Related posts