telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

నేడు చంద్రబాబు పెళ్లి రోజు..లోకేశ్ శుభాకాంక్షలు

ఇవాళ టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పెళ్లి రోజు జరుపుకొంటున్నారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు, నందమూరి అభిమానులు చంద్రబాబు, భువనేశ్వరి దంపతులకు అభినందనలు తెలుపుతున్నారు. మరెన్నో వివాహ వార్షికోత్సవాలు జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.

ఈ సంద‌ర్భంగా వారి ఫొటోను పోస్ట్ చేస్తూ వారి కుమారుడు నారా లోకేశ్ శుభాకాంక్ష‌లు తెలిపారు.”అమ్మానాన్నలకు పెళ్లిరోజు శుభాకాంక్షలు.  ప్రజల కోసం ఒకరు, కుటుంబం కోసం మరొకరు శ్రమిస్తూనే… ఒకరి ఆశయాలకు మరొకరు అండగా నిలిచి, ఆదర్శ దంపతులకు మీరు అసలైన నిర్వచనమయ్యారు. మీరిలాగే ఆది దంపతుల్లా కలకాలం మా కళ్ల‌కు పండువ‌గా నిలవాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను” అని  లోకేశ్ ట్వీట్ చేశారు.

Related posts