telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

కమర్షియల్ జీవితాన్ని మొదలు పెట్టిన హీరో నితిన్…

ప్రస్తుతం వరుస సినిమాలలో బిజిగా ఉన్నాడు యంగ్ హీరో నితిన్. ఈ ఏడాది మొదటనుంచి విజయాలను తన ఖాతాలో వేసుకుంటున్నాడు. ఈ యంగ్ హీరో ప్రస్తుతం చెక్ అనే సినిమాకు సిద్దమవుతున్నాడు. అయితే ఈ హీరో తన కమర్షియల్ జీవితాన్ని మొదలు చేశాడు. కొన్ని బ్రాండ్‌లతో ఒప్పందంతో వాటి కమర్షియల్స్‌లో కనబడనున్నాడు. ఈ విషయాన్ని నితిన్‌ స్వయంగా తెలియ పరిచాడు. కొన్ని రోజుల క్రితం ఒక కమర్షియల్‌కు సంబంధించి కొన్ని ఫొటోలు కూడా వచ్చాయి. ఈ ఫొటోలను కూడా నితిన్ షేర్ చేశాడు. ఆ ఫొటోలను చూసి అదేదో పెద్ద కంపెనీ కమర్షియల్ అనుకుంటే పప్పు కాలేసినట్లే. హైదరాబాద్‌కు చెందిన స్నేహా చికెన్ బ్రాండ్‌కు చేశాడు.  అందులో నితిన్‌ తల్లిగా సీనియర్ నటి ప్రగతి కనిపించారు. ఈ కమర్షియల్ ‘ఈ అమ్మలెప్పుడూ ఇంతేనండీ. మనం ఎక్కడున్నా ఒక్కటే ప్రశ్న. తిన్నావా? అని. ఆ ప్రశ్నకు సమాధానం స్నేహా చికెన్ అయితే ప్రతి అమ్మకి పండగే’ అంటూ స్నేహా చికెన్‌ను నితిన్ ప్రమోట్ చేశాడు. అందులో నితిన్ అడుగుతున్న ’తిన్నావా‘ అనే ప్రశ్న సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీనికి సంబంధించిన వీడియోను నిర్వాహకులు విడుదల చేశారు. అయితే ఈ హీరో మరికొన్న బ్రాండ్‌లకు కూడా సంతకాలు చేశాడని సమాచారం.

Related posts