telugu navyamedia
ట్రెండింగ్ రాశి ఫలాలు వార్తలు సామాజిక

రాశిఫలాలు : .. అదృష్టవంతమైన రోజు.. ప్రశంసలు పొందుతారు..

today rasi falalu

మేషం : ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం. ముఖ్యంగా కం టికి సంబంధించిన సమస్యలతో బాధపడే అవకాశం ఉంటుంది. మానసికంగా ఆందోళనగా ఉంటుంది. అలాగే పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. శివారాధన చేయటం మంచిది.

వృషభం : ఆహ్లాద కరమైన రోజు. ఇష్టమైనా వారితో గడుపుతారు. బంధుమితుల సమాగమం. వివాహాది శుభకార్యాల్లో పాల్గొనటం అలాగే పాత మిత్రులను కలవటం జరుగుతుంది.

మిథునం : అనుకున్న పనులు అవుతాయి. చాలాకాలం నుంచి ఎదురుచూస్తున్న విషయంలో శుభవార్త వింటారు. మీ లక్ష్యం నెరవేరుతుంది. ధనలాభం కలుగుతుంది. అలాగే రుచికరమైన భోజనం చేస్తారు. మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది.

కర్కాటకం : ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం. ఉదర లేదా ఛాతి సంబంధ సమస్యలు వచ్చే అవకాశముంటుంది. నిద్రలేమి కారణంగా మానసిక ప్రశాంతత ఉండదు. అలసట, నీరసం అధికంగా ఉంటాయి. పనుల్లో అవరోధాలు ఏర్పడతాయి.

సింహం : ఈ రోజు మీ సహోద్యోగులతో, పై అధికారులతో సామరస్యంగా వ్యవహరించటం మంచిది. మీ అజాగ్రత్త కారణంగా వారి కోపానికి గురయ్యేఅవకాశమున్నది. వారితో వాదనకు దిగకండి. మాట విషయంలో జాగ్రత్త అవసరం.

కన్య : మీ జీవిత భాగస్వామితో, పిల్లలతో ఆనందంగా గడుపుతారు. వారితో కలిసి వినోదయాత్ర చేసే అవకాశముంది. ఖర్చు అధికంగా ఉంటుంది. మీ సంతానం కారణంగా ఆనందం పొందుతారు.

తుల : అనుకున్న పనులు పూర్తి చేయటానికి, కొత్త పనులు ప్రారంభించటానికి అనుకూలమైన రోజు. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. మీ పనికి గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగంలో అభివృద్ధి సాధిస్తారు. సహోద్యోగుల నుంచి ప్రశంసలు అందుకుంటారు.

వృశ్చికం : ఆర్థికంగా కొంత ఇబ్బందిని కలిగించే రోజు. ధన నష్టం కానీ, అనవసరమైన ఖర్చు కానీ ఉంటుంది. పెట్టుబడులకు అనుకూలమైన రోజు కాదు. ఎవరికి కూడా డబ్బువిషయంలో మాట ఇచ్చి ఇబ్బంది పడకండి. ఆర్థిక నియంతణ అవసరం.

ధనుస్సు : ఆరోగ్య విషయంలో ఈ రోజు కొంత జాగ్రత్త అవసరం. కడుపు నొప్పి కానీ, ఛాతిలో మంటతో కానీ బాధ పడే అవకాశముంటుంది. ఆహారం విషయంలో జాగ్రత్త అవసరం. బయటి భోజనం చేయకండి. అలాగే మీ కుటుంబ సభ్యులలో ఒకరి ఆరోగ్యం కూడా మీకు ఆందోళన కలిగించే అవకాశం ఉన్నది.

మకరం : ఈ రోజు ఆర్థికంగా కలిసి వస్తుంది. పెట్టుబడుల నుంచి లాభాలు వస్తాయి. అలాగే మొండి బకాయిలు వసూలవుతాయి. భూ సంబంధ లావాదేవీలు చేస్తారు. కుటుంబ సభ్యుల సహాయ, సహకారాలు అందుతాయి. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం.

కుంభం : మీరు చేపట్టే పనుల్లో అవరోధాలు ఏర్పడతాయి. ముఖ్యంగా మీ కార్యాలయంలో మీరు చేయాలనుకున్న పనికి సహోద్యోగుల నుంచి వ్యతిరేకత రావచ్చు. ఆవేశానికి లోను కాకుండా సామరస్యపూర్వకంగా వ్యవహరించండి. శారీరక, మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది. విశ్రాంతి అవసరం. ఇష్టమైన వారితో గడుపుతారు.

మీనం : అదృష్టం కలిసివచ్చే రోజు. మీరు చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్న పనులు ఒక కొలిక్కి వస్తాయి. మీ తోటి వారి నుంచి కానీ, సహోద్యోగుల నుంచి కాని ప్రశంసలు అందుకుంటారు.

Related posts