telugu navyamedia
సినిమా వార్తలు

“మన్మథుడు-2” వివాదం… ట్రోలింగ్ పై దర్శకుడి ఫైర్

Rahul-Ravindran

టాలీవుడ్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జున ప్రస్తుతం “మన్మథుడు-2″‘ సినిమాలో నటిస్తున్నాడు. రాహుల్ రవీంద్రన్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా టీజర్ ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ టీజర్ చూసిన కొందరు మాత్రం నాగార్జునకి ఈ వయసులో బోల్డ్ సీన్స్ అవసరమా..? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా.. రాహుల్ రవీంద్రన్ భార్య సింగర్ చిన్మయి గతంలో సీనియర్ హీరోలు తమకంటే వయసులో తక్కువైన నటీమణులతో రొమాన్స్ చేయడం ఇండియాలోనే జరుగుతుంటుందని మండిపడింది. ఇంట్లో భర్తకి చెప్పలేవ్ కానీ నీకెందుకు ఇలాంటి స్టేట్మెంట్లు అంటూ మండిపడ్డారు. ఈ వివాదాలు చాలవన్నట్లు ఇప్పుడు దర్శకుడు రాహుల్ రవీంద్రన్ పై కొందరు అభిమానులు ఫైర్ అయ్యారు. “మన్మథుడు” టైటిల్ ని వాడుకోవడంపై కొందరు అక్కినేని అభిమానులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కొందరి ట్వీట్లు శృతిమించడంతో హర్ట్ అయిన రాహుల్ తన సహనాన్ని కోల్పోయాడు. నేనేదో ఆస్తులు తీసుకుంటున్నట్లు ఎందుకలా ఫీల్ అవుతున్నారో అర్ధం కావడం లేదని, ఇంత ద్వేషం తగదని సోషల్ మీడియాలో కామెంట్ చేశాడు. ఆగస్ట్ 9న ఈ సినిమా విడుదల కానుంది.

Related posts