telugu navyamedia
సినిమా వార్తలు

ఆసక్తికరంగా “రాక్షసుడు” టీజర్

Rakshasudu

బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం “రాక్షసుడు”. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ నేపధ్యంలో సాగే ఈ చిత్రంలో బెల్లంకొండ శ్రీనివాస్ సరసన అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోంది. తమిళంలో సూపర్ హిట్ అయిన “రాచ్చసన్” చిత్రానికి రీమేక్ గా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్ ని విడుదల చేశారు. ఇందులో విజువల్స్, డైలాగ్స్, నేపధ్య సంగీతం మొత్తం కూడా ఒరిజినల్ సినిమాను తలపిస్తోంది. ఈ సినిమాలో బెల్లంకొండ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు. వరుస హత్యలు, ముఖ్యంగా స్కూల్ కి వెళ్లే అమ్మాయిలను టార్గెట్ చేసి చంపే సీరియల్ కిల్లర్ ని పట్టుకోవడానికి సినిమాలో హీరో ఏం చేశాడనేదే కథ. ఈ సినిమాతో కచ్చితంగా సక్సెస్ అందుకుంటాననే నమ్మకంతో ఉన్నాడు బెల్లంకొండ. ఈ సినిమాను కోనేరు సత్యనారాయణ నిర్మించారు. జూలై 18న ఈ సినిమాను విడుదల చేయనున్నారు. మరి ఈ టీజర్ ను మీరు కూడా ఒకసారి వీక్షించండి.

Related posts