telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు సినిమా వార్తలు

టాలీవుడ్ ఎన్నికలు.. పోటీలో శివాజీ రాజా, నరేష్.. ; హోరెత్తుతున్న ప్రచారం..

maa association elections on 10th

టాలీవుడ్ లో మూవీ ఆర్టిర్ట్స్ అసోసియేషన్ ఎన్నికలకు మళ్ళీ గంట మోగింది. దీనితో ప్రచార హోరు కూడా ప్రారంభం అయ్యింది. ప్రధాన పోటీదారులుగా శివాజీరాజా, నరేష్ లు ఉన్నారు. అయితే పోయినసారి సాధారణ ఎన్నికలను తలపించే రేంజ్ లో జరిగిన ‘మా’ ఎన్నికల ప్రచారం, ఈ సారి కూడా అదే పంధా లో కొనసాగించబోతోంది. గత ఎన్నికల సందర్భంగానే ‘మా’ నిధులను శివాజీ రాజా బృందం దుర్వినియోగం చేస్తున్నారనే ఆరోపణలు చేసిన నరేష్ ఇప్పుడు శివాజీ రాజా ప్యానల్ కు గట్టిపోటీ ఇచ్చేందుకు రెడీ అయ్యాడు. అప్పట్లో శివాజీ రాజా పై నరేష్ చేసిన ఆరోపణల ‘మా’ విశ్వసనీయతను సవాల్ చేశాయి.

ఈ సారి ఎన్నికలలో అధ్యక్ష పదవికి శివాజీ రాజాపై నరేష్; ఉపాధ్యక్షుడి పదవికి శ్రీకాంత్, రాజశేఖర్; జనరల్ సెక్రటరీ పదవికి జీవితా రాజశేఖర్, రఘుబాబు లు పోటీ పడనున్నారు. రాజేంద్రప్రసాద్, జయసుధ ప్యానల్ పోటీ పడినప్పుడు ‘మా’ ఎలెక్షన్స్ లో తొలిసారి పోటీ వాతావరణం కనపడింది. గత యేడాది ఏకగ్రీవంగా శివాజీ రాజా అద్యక్షుడిగా ఎంపిక అయ్యారు. కానీ నరేష్ చేసిన ఆరోపణలు ఈసారి శివాజీ రాజాను పోటీలోకి దింపాయి.

జీవితా రాజశేఖర్ దంపతులు నరేష్ కి అండగా నిలబడగా, శివాజీ రాజాకు శ్రీకాంత్ తో పాటు ఎస్వీ కృష్ణారెడ్డి , పరుచూరి వెంకటేశ్వరావు, రఘుబాబు వంటి సినీ పెద్దలు సపోర్ట్ గా నిలిచారు. నరేష్ చేసిన ఆరోపణలు కొట్టి పారేయడానికి లేదు. ‘మా’ లో కీలక బాధ్యతలు వహిస్తూ అద్యక్ష పదవికి ఎదిగిన శివాజీ రాజాకు ఉన్న ఇమేజ్ తక్కువేమీ కాదు. అందరినీ కలుపుకు పోవడం.. సినీయర్ కళాకారులకు పింఛన్లు పెంచడంలో ఆయన తీసుకున్న చొరవ అందిరీ మెప్పు పొందింది. అయితే ఈ నెల 10 న జరగనున్న ‘మా’ ఎలెక్షన్స్ శివాజీరాజా నిజాయితీని నిరూపంచుకునే పరీక్షలా మారాయి. నరేష్ ప్యానల్ కూడా ‘మా’ గౌరవం పెంచేందుకు కృషి చేస్తామని వాగ్దానాలు చేస్తున్నాయి. మరి ఈ ‘మా’ ఎన్నికలు ఎవరి నిజాయితీని నిరూపిస్తాయో వేచిచూడాల్సిందే..!

Related posts