telugu navyamedia
సినిమా వార్తలు

ఈ స్టార్ హీరో పాటను నెటిజన్లు వినలేకపోతున్నారట…!

Salman-Khan

బాలీవుడ్ స్టార్ హీరో, కండల వీరుడు సల్మాన్ ఖాన్ నిర్మిస్తున్న సినిమా “నోట్ బుక్”. ఈ చిత్రం మార్చ్ 29న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమాలో జహీర్ ఇక్బాల్, ప్రసూతన్ హీరోహీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా కోసం సల్మాన్ మరోమారు తన గొంతు సవరించారు. ఈ సినిమాలో ఆయన పాడిన పాటకు సంబంధించిన టీజర్ విడుదలైంది. ఈ పాటను విన్న నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ చిత్రంలో పాక్ సింగర్ ఆతిఫ్ పాడిన పాటను పుల్వామా ఘటన తో తొలగించడంతో… ఆ పాటను సల్మాన్ పాడారు. ఈ పాట టీజర్‌ను వీడియో ట్రెండ్ ఎనలిస్ట్ తరణ్ ఆదర్శ్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. ఈ పాట వినగానే పలువురు నెటిజన్లు సల్మాన్ గొంతు బాగోలేదని అంటున్నారు. గతంలో రేస్-3లో సల్మాన్ పాడినపాట ఫ్లాప్ అయ్యిందని గుర్తుచేస్తున్నారు. గతంలో సల్మాన్ ‘హీరో’, ‘రేస్-3’ సినిమాల్లో పాటలు పాడారు.

Related posts