telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

ఆ సినిమా పోస్టర్లను చింపేసిన భజరంగ్ దళ్ కార్యకర్తలు…

Dirty-Hari

నేరుగా ఓటీటీ లో విడుదలవుతున్న సినిమాలకు సెన్సార్ ఉండదు. కాబట్టి అవి కొంచెం మితిమీరిన అంశాలతో వస్తున్నాయి. తాజాగా ‘డర్టీ హారీ’ సినిమా పోస్టర్లు అశ్లీలంగా ఉన్నాయని, ఆ సినిమాను నిషేదించాలంటూ ఈ రోజు కూకట్‌పల్లి బస్ స్టాప్ వద్ద మెట్రో పిల్లర్లకు ఏర్పాటు చేసిన ఆ సినిమా పోస్టర్లను భజరంగ్ దళ్ కార్యకర్తలు చింపివేసారు. అనంతరం ఆ పోస్టర్లను తగులపెట్టారు. ఈ సందర్భంగా భజరంగ్ దళ్ నాయకుడు జీవన్ మాట్లాడుతూ భారత దేశం సాంస్కృతి సాంప్రదాయాలు హాని కలిగించే  డర్టీ హరి లాంటి సినిమాలకు తాము వ్యతిరేకమని అన్నారు. అటువంటి సినిమాలను నిషేదించాలని డిమాండ్ చేసారు. ఎటువంటి సెన్సార్ లేకుండా సినిమాలు విడుదల చేస్తుంటే సెన్సార్ బోర్డు ఏమి చేస్తుందని ప్రశ్నించారు. ఇటువంటి సినిమాలు ఎక్కడ విడుదల అయిన అడ్డుకుంటామని అన్నారు. ఫ్రైడే మూవీస్ యాప్ ద్వారా ఈనెల 18న ఈ సినిమాను విడుదల చేశారు. ప్రముఖ నిర్మాత ఎం.ఎస్. రాజు దర్శకత్వంలో రూపొందిన రొమాంటిక్ థ్రిల్లర్ ‘డర్టీ హరి’. శ్రవణ్ రెడ్డి, రుహానీ శర్మ, సిమ్రత్ కౌర్ హీరో హీరోయిన్లుగా నటించారు.

Related posts