telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఎత్తిపోతల కరెంటు బిల్లుల మీద కూడా ఎత్తిపొడిచారు: కేసీఆర్

KCR cm telangana

వ్యవసాయానికి ఉచిత కరెంటు కచ్చితంగా ఇచ్చి తీరుతామని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. రైతులను రుణ విముక్తులను చేయాలన్నదే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని శాసనసభలో తెలిపారు. ఎత్తిపోతల కరెంటు బిల్లుల మీద కూడా మమ్మల్ని ఎత్తిపొడిచారని అన్నారు. ఎత్తిపోతల కరెంటు బిల్లుల పై జయప్రకాశ్ నారాయణకు ఏం తెలుసు అని ప్రశ్నించారు. పాలమూరుకు పోతే సంతోషమేస్తోందని, నీళ్లను చూసి జనం ఎగిరి గంతేస్తున్నారని అన్నారు.

రైతుబంధును బీజేపీ మంత్రులే వచ్చి మెచ్చుకుంటున్నారు. రైతుబంధు లాంటి పథకాన్ని ప్రవేశపెడుతున్నామని ఒడిషా సీఎం నా సమక్షంలోనే ప్రకటించారని తెలిపారు. గతంలో రైతు దురదృష్టవశాత్తు చనిపోతే ఏ ప్రభుత్వమూ కనికరించలేదన్నారు. ప్రస్తుతం గుంటభూమి ఉన్న రైతు చనిపోయినా 10 రోజుల్లో రూ.5 లక్షలు పరిహారం ఇస్తున్నమని పేర్కొన్నారు.

 

Related posts