telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు సామాజిక

సోనూ సూద్ ను అభినందించిన చంద్రబాబు

chandrababu

ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్న తండ్రికి చేయూతనించ్చేందుకు తన ఇద్దరు అమ్మాయిలు ఎంత శ్రమతో పొలంలో కాడెత్తుకుని అరక దున్నారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ ఘటన పట్ల స్పందించిన ప్రముఖ నటుడు సోనూ సూద్ ఇప్పటికే ఆ రైతు కుటుంబానికో కొత్త ట్రాక్టర్ ను బహూకరించారు. దీనిపై చంద్రబాబు ట్విట్టర్ లో స్పందించారు.

చిత్తూరు జిల్లా రైతు నాగేశ్వరరావు కుటుంబం పట్ల సోనూ సూద్ ఎంతో ఆపేక్ష ప్రదర్శించి ట్రాక్టర్ ను అందించడం పట్ల అభినందించానని తెలిపారు. సోనూ సూద్ తో మాట్లాడానని చంద్రబాబు వెల్లడించారు. ఆ కుటుంబ పరిస్థితి తనను కదిలించి వేసిందని అన్నారు. రైతు నాగేశ్వరరావు ఇద్దరు కుమార్తెల చదువుల బాధ్యతలను తాను స్వీకరిస్తానని హామీ ఇచ్చారు.

Related posts