telugu navyamedia
ఆరోగ్యం వార్తలు

వాక్సిన్ కి డిమాండ్ ఉంటుందా

corona vaccine covid-19

హెర్డ్ ఇమ్మ్యూనిటి వచ్చే లోపల వాక్సిన్ అమ్మేసుకోవాలి ఇది వాక్సిన్ సంస్థల తాపత్రయం. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఉత్సాహంగా కోవిడ్ 19 వాక్సిన్ తయారు చేసే పనిలో నిమగ్నమయిన 150 కి పైగా సంస్థలకు కొత్త సమస్య వచ్చిపడ్డది. వీటిలో ఒక 15 సంస్థలు బాగా ముందంజలో ఉన్నాయి.

కానీ ఈ సంస్థల కన్నా కరోన వైరస్ చాలా స్పీడ్ గా ఉంది. ఇప్పటికే అనేకమందికి సోకి వారిలో రోగ నిరోధక వ్యవస్థని ఉత్తేజితం చేసింది. వారిలో antibodies, t సెల్స్ ఉత్పత్తి అయ్యేలా చేసింది. వాక్సిన్ చేయాల్సిన పని వైరస్ చేసేస్తోంది. దీనిని సహజ రోగ నిరోధకత అంటారు. వాక్సిన్ ఇచ్చినపుడు కూడా జరిగేది ఇదే. మరి రెండింటికి తేడా ఏమిటంటే సహజ రోగనిరోధకత ప్రక్రియలో మనిషిలో కొంత నష్టం జరుగుతుంది. కృత్రిమ రోగ నిరోధకత (వాక్సిన్) లో అటువంటి నష్టం ఉండదు. రెండిటి గమ్యం ఒకటే, ఫలితం ఒక్కటే. నిజం చెప్పాలంటే కృత్రిమ రోగ నిరోధకత కంటే సహజ రోగ నిరోధకత ఎక్కువకాలం ఉంటుంది, ఖచ్చితంగా పనిచేస్తుంది.

ఎక్కడ వైరస్ వ్యాప్తి బాగా ఉందొ అక్కడ ఇప్పటికే 25% మందిలో రోగ నిరోధకత ఉంది. కొందరిలో antibodies సంఖ్య తగ్గిపోయినా రోగనిరోధకత ఉంది. అంటే మెమరీ సెల్స్ ఉత్పత్తి అయిందన్నమాట. ఇంకొంత మందిలో అంతర్గత రోగ నిరోధకత ఉంది. మరికొంత మందిలో త్వరలో వచ్చేస్తుంది.

ఇదంతా చాలా వేగంగా జరుగుతుంది. ఎందుకంటే ఈ వైరస్ ఇన్ఫెక్టీన్ వేగం ఎక్కువ. ఇంత త్వరగా ఏ వైరస్ వ్యాప్తి చెందలేదు గతంలో.

వాక్సిన్ protocols అన్ని పాటిస్తే వచ్చే మార్చి వరకు కూడా విడుదల కావు. కానీ వైరస్ వ్యాప్తి
ఇలాగే కొనసాగితే డిసెంబర్ వరకు ప్రపంచ వ్యాప్తంగా అందరికి హెర్డ్ ఇమ్మ్యూనిటి వస్తుంది. ఇక వాక్సిన్ తో పనే ఉండదు.

అందుకే, అన్ని protocols ప్రక్కకి పెట్టి vaccineలను వివిధ దేశాలు ముందుకు తెస్తున్నాయి. లేదంటే పెట్టిన పెట్టుబడి ఖలాస్.

మరి ఇలా హడావుడి గా వాక్సిన్ తెస్తే ఆరోగ్య సమస్యలు ఉండవా!
ఉండకపోవచ్చు, ఇది ఒక మాములు వైరస్. 10వేల మందిలో ఒక్కరికి ప్రమాదకర వైరస్. వాక్సిన్ తయారు చేసేపుడు దీనిలో ఉండే ప్రమాదకర లక్షణాలు తొలిగిస్తున్నారు అందువల్ల భారీ ఆరోగ్య సమస్యలు ఉండకపోవచ్చు. ఇది మామూలు వైరస్ కాబట్టే ఇంత త్వరగా, ఇన్ని సంస్థలు ముందుకు వస్తున్నాయి. ఎన్నో సంవత్సరాలుగా ఉన్న ఎయిడ్స్ లాంటి వాటికి ఇప్పటికి వాక్సిన్ ఇస్తామని ఏ సంస్థ గట్టిగా చెప్పడం లేదు.

డిసెంబర్ తరువాత వస్తే వాక్సిన్ కు పెద్దగా డిమాండ్ ఉండకపోవచ్చు…అందుకే ఈ హడావుడి వడ్డన.. చూద్దాం….
Dr. A. Venu Gopala Reddy,
Microbiologist

Related posts