telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

కాఫీ డే తాత్కాలిక ఛైర్మన్ గా ఎస్వీ రంగనాథ్

sv ranganath cofee

కాఫీ డే సంస్థ అధినేత వీజీ సిద్ధార్థ్ ఆత్మహత్యకు పాల్పడ్డ సంగతి తెలిసిందే. ఆయన మూర్తి పై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ క్రమంలో ఆయన స్థానంలో తాత్కాలిక ఛైర్మన్ గా ఎస్వీ రంగనాథ్ బాధ్యతలను చేపట్టారు. బెంగళూరులోని సంస్థ ప్రధాన కార్యాలయంలో ఈరోజు బోర్డ్ డైరెక్టర్ల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రంగనాథ్ కు బాధ్యతలను అప్పగిస్తూ డైరెక్టర్లు నిర్ణయం తీసుకున్నారు.

తదుపరి సమావేశం ఆగస్ట్ 8న ఉంటుందని డైరెక్టర్లు తెలిపారు. మరోవైపు నితిన్ బగ్మనే తాత్కాలిక చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ గా నియమితులయ్యారు. రంగనాథ్ ఇంత కాలం కాఫీ డే సంస్థ నాన్ ఎగ్జిక్యూటివ్ ఇండిపెండెంట్ డైరెక్టర్ గా విధులను నిర్వహించారు.

Related posts