తెలంగాణ రాష్ట్రంలో మూడు విడతలుగా గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల ఏర్పాట్లు, సన్నద్ధతపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్ కే జోషి వీడియా కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమీక్షలో జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, డీజీపీ మహేందర్ రెడ్డి, ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి, పంచాయతీ అధికారులు పాల్గొన్నారు.
ఎన్నికల నిర్వహణ, ఏర్పాట్లు, శాంతిభద్రతలపై చర్చించారు. పంచాయతీ ఎన్నికలు మూడు దశల్లో జరగనున్నాయి. తొలి దశ జనవరి 21న, రెండో దశ 25న, మూడో విడత పోలింగ్ జనవరి 30న నిర్వహించనున్నారు. తొలి విడుతలో 4480, రెండో విడుతలో 4137, మూడో విడుతలో 4115 పంచాయతీలకు పోలింగ్ జరగనుంది.