telugu navyamedia
క్రైమ్ వార్తలు తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

శ్రీశైలం ప్రమాదంలో చిక్కుకున్న 9 మంది వివరాలు!

srishailam power house

శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలోని మొదటి యూనిట్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో పది మంది బయటకు వచ్చారు. లోపల తొమ్మిది మంది లోపల చిక్కుకున్న సంగతి తెలిసిందే. దట్టమైన పొగ ఉండటం వలనే సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది.

ఫైర్, పోలీస్ సిబ్బంది లోపల చిక్కుకున్న వారిని కాపాడేందుకు వెళ్లారని, పొగతో మూడు సార్లు వెనక్కి వచ్చారని తెలిపారు. ఆక్సిజన్ పెట్టుకుని వెళ్లినా సంఘటనా స్థలానికి వెళ్లలేకపోతున్నారని వివరించారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది లోపలకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. లోపల చిక్కుకున్న 9 మంది వివరాలు ఇలా ఉన్నాయి.

1. డీ ఈ శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్
2. ఏ ఈ వెంకట్ రావు పాల్వంచ
3. ఏ ఈ మోహన్ కుమార్ హైదరాబాద్
4. ఏ ఈ ఉజ్మ ఫాతిమా హైదరాబాద్
5. ఏ ఈ సుందర్ సూర్యాపేట
6. ప్లాంట్ అటెండెంట్ రాంబాబు ఖమ్మం జిల్లా
7. జూనియర్ ప్లాంట్ అటెండెంట్ కిరణ్ పాల్వంచ
8. ఆమెరాన్ బ్యాటరీ కంపెనీ ఉద్యోగి వినేష్
9. బ్యాటరీ కంపెనీ ఉద్యోగి మహేష్ కుమార్

Related posts