telugu navyamedia
క్రీడలు సినిమా వార్తలు

ఇలాంటి వ్య‌క్తితో సుల‌భంగా ప్రేమ‌లో ప‌డొచ్చు : మురిసిన అనుష్క

Anushka-Sharma-and-virat-Kohli

ఇటీవ‌ల ఇంగ్లండ్‌లో ఆస్ట్రేలియాతో జ‌రిగిన మ్యాచ్‌లో బ్యాట్‌తోనే కాకుండా త‌న ప్ర‌వ‌ర్త‌న‌తోనూ అభిమానుల‌ను ఆక‌ట్టుకున్నాడు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ. ఆస్ట్రేలియా ఆట‌గాడు స్టీవ్ స్మిత్ ప‌ట్ల ప్రేక్ష‌కుల ప్ర‌వ‌ర్త‌న‌ను త‌ప్పుప‌డుతూ కోహ్లీ వ్య‌వ‌హ‌రించిన తీరు ప్ర‌శంస‌లు అందుకుంటోంది. నిజానికి బ‌హిష్క‌ర‌ణ త‌ర్వాత ప్ర‌పంచ‌క‌ప్ ఆడుతున్న స్మిత్‌కు ప్రతి మ్యాచ్‌లోనూ ఇదే అనుభవం ఎదురవుతోంది. అంత‌కుముందు మ్యాచ్‌ల్లో కూడా “చీట‌ర్‌… చీట‌ర్‌” అంటూ ప్రేక్ష‌కులు స్మిత్‌ను అవ‌మానించారు. భార‌త్ అభిమానులు కూడా అలాగే ప్ర‌వ‌ర్తించ‌డంతో కోహ్లీ వారిని వారించి స్మిత్‌ను అభినందించాల్సిందిగా కోరాడు. మైదానంలో కోహ్లీ వ్య‌వ‌హ‌రించిన తీరును ప్ర‌శంసిస్తూ మీడియాలో వ‌చ్చిన వార్త‌లు అనుష్క‌కు సంతోషంలో ముంచెత్తుతున్నాయి. కోహ్లీని ప్‌‌శంసిస్తూ వ‌చ్చిన‌ ఒక వార్త‌ను త‌న సోష‌ల్ మీడియా ఖాతాలో పొందుప‌రిచిన అనుష్క “దూకుడైన ఆట‌గాడు.. స‌హ‌నంతో కూడిన వ్య‌క్తిత్వం.. ఇలాంటి వ్య‌క్తితో సుల‌భంగా ప్రేమ‌లో ప‌డొచ్చు” అంటూ అనుష్క పోస్ట్ చేసింది.

Related posts