telugu navyamedia
సినిమా వార్తలు

“జబర్దస్త్”కు న్యాయనిర్ణేతగా జయసుధ… నిరాకరించిన సహజనటి

Jayasudha

బుల్లితెరపై పాపులర్ అయిన “జబర్దస్త్” కామెడీ షో గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ షో ఎంతగానో ప్రజాదరణ పొందింది. అన్ని వర్గాల ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇప్పటి వరకూ ఈ ప్రోగ్రాంకు నాగబాబు, రోజా జడ్జిలుగా వ్యవహరించారు. అయితే ఇప్పుడు ఈ షోలో కొత్త జడ్జిలు అలనాటి అందాల తార మీనా, ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ కన్పిస్తున్నారు. తమ పార్టీలకి సంబంధించిన కార్యకలాపాల్లో నిమగ్నమైపోయిన నాగబాబు, రోజా రాజకీయాలకే ప్రాధాన్యత ఇవ్వనున్నారట. అందుకే ఈ కామెడీ షో నిర్వాహకులు క్రేజ్ వున్న సీనియర్ నటీమణులను న్యాయనిర్ణేతలుగా తీసుకోవడానికి ప్రయత్నించారట. ఆ క్రమంలోనే జయసుధను కూడా సంప్రదించారనీ, అయితే ఆమె సున్నితంగా తిరస్కరించారని ప్రముఖ ఆంగ్ల దినపత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. కుటుంబ కథా చిత్రాలతో .. సహజనటిగా జయసుధకు మంచి పేరు వుంది. రీ ఎంట్రీలో కూడా ఆమె తన వయసుకి తగిన పాత్రలను, హుందాతనంతో కూడిన పాత్రలను చేస్తూ సినిమాల్లో కొనసాగుతున్నారు. ఈ కారణంగానే తనకు ఈ కామెడీ షోకి సెట్ కాదని ఆమె సున్నితంగా తిరస్కరించారని తెలుస్తోంది. జయసుధ తిరస్కరించిన తరువాతనే మీనాను ఎంపిక చేసుకున్నారట.

Related posts