ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ప్రేమతోనే సీఎం చంద్రబాబుపై విమర్శలు చేస్తున్నానని చెప్పారు. ఎన్నికల్లో 45 శాతం ఈవీఎంలు పనిచేయలేదని, ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా రాత్రిపూట పోలింగ్ జరిగిందని విమర్శించారు.పోలీసులు ఓటరు స్లిప్పులు పంచడమేంటని ఆయన ప్రశ్నించారు. సాయంత్రం 6.30 నుంచి తెల్లవారే వరకు రిగ్గింగ్ చేశారని ఆరోపించారు.
”నేను గెలుస్తానని నా ప్రత్యర్థులే అంగీకరించారు. నాతో చంద్రబాబు కలిసి వస్తే ఈసీకి బుద్ధి వచ్చేలా చేస్తాను. పోలింగ్ తర్వాత పవన్ ఎందుకు స్పందించలేదు?. భీమవరంలో పవన్ ఓడిపోతారు.. గాజువాకలో గెలవొచ్చు. చేసిన పాపంపై జగన్ ఇప్పటికీ క్షమాపణ కోరలేదు” అని కేఏ పాల్ అన్నారు.