దేశ వాణిజ్య రాజధాని ముంబైలో దారుణం చోటుచేసుకుంది. ముంబైలోని బాండూప్ ఏరియాలో ఉన్న కరోనా ఆస్పత్రిలో ఇవాళ ఉదయాన్నే భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు కరోనా బాధితులు సజీవదహనం అయినట్లు సమాచారం. కాగా.. ఆస్పత్రిలో 76 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నట్లు తెలిసింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని 23 ఫైరింజన్లతో మంటలు అదుపులోకి తెచ్చే ప్రయత్నాలు చేశారు. ఇటీవల షాపింగ్ మాల్‌ను లీజ్‌కు తీసుకున్న అధికారులు కరోనా ఆస్పత్రిగా మార్చి.. బాధితులకు సేవలు అందిస్తున్నారు. అయితే.. లీజ్‌కు తీసుకున్న కొన్ని రోజులకే ఈ ప్రమాదం జరగడం అందరినీ కలవరపెడుతోంది. మాల్‌లోని మూడో అంతస్తులో చెలరేగిన మంటల కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం అందుతోంది.