telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

కీర్తి సురేశ్ ను ఫాలో అవుతున్న కలర్‌ ఫోటో భామ!

Chandini

జయాపజయాలతో సంబంధం లేకుండా కీర్తి సురేశ్ వివిధ భాషల్లో దూసుకుపోతోంది. ప్రిన్స్ మహేశ్ బాబు ‘సర్కారు వారి పాట’లో ఛాన్స్ దక్కించుకున్న కీర్తి సురేశ్ సంక్రాంతికి ‘రంగ్ దే’తో సందడి చేయబోతోంది. విశేషం ఏమంటే… తెలుగమ్మాయి చాందినీ చౌదరి కూడా ఇప్పుడు కీర్తి సురేశ్ బాట పట్టింది. చాందిని… కీర్తిని ఏ విషయంలో అనుకరిస్తోందనే సందేహం కొందరికి రావచ్చు. కానీ అలాంటిదేమీ లేదు. మిగిలిన హీరోయిన్ల కంటే… లాక్ డౌన్ కాలంలో ఓటీటీ ప్లాట్ ఫామ్ లో కీర్తి సురేశ్ ఎక్కువ సందడి చేసింది. ఆమె నటించిన ‘పెంగ్విన్’తో పాటు ‘మిస్ ఇండియా’ సినిమా ఓటీటీలో విడుదలైంది. ఇదే సమయంలోనే చాందిని నటించిన రెండు సినిమాలు ఓటీటీ ప్లాట్ ఫామ్ లో రిలీజ్ కావడం విశేషం. ఈ వైజాగ్ చిన్నది నటించిన ‘కలర్ ఫోటో’ ఆహాలో స్ట్రీమింగ్ కాగా, తాజాగా ‘బంభాట్’ మూవీ అమెజాన్ ప్రైమ్ లో సందడి చేస్తోంది. కొందరు హీరోయిన్లు తమ సినిమాలు ఓటీటీలో విడుదల కావడాన్ని తక్కువగా భావిస్తున్నారు కానీ… నయనతార వంటి స్టార్ హీరోయిన్ సైతం ఓటీటీ రిలీజ్ కు సై అనేసింది. ఇటీవల థియేటర్లు తెరుచుకున్నా… జనం రావడానికి సంశయిస్తున్న ఈ సందర్భంలో ఓటీటీల హావా ఇంకొంతకాలం కొనసాగడం ఖాయం!

Related posts