telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్ వార్తలు

కాలు మీద కాలు వేసి కూర్చుంటున్నారా ? అయితే ఆ సమస్యలు తప్పవు !

సాధారణంగా ఎవరైనా.. టైం దొరికినప్పుడు ఒక కాలుపై మరొక కాలు వేసి అంటే క్రాస్‌ లెగ్‌ వేసి కూర్చోవడం కామన్‌. ఇలా కూర్చోవడం వల్ల కొంచెం రిలాక్స్‌, స్టైల్‌గా ఉంటుంది. అయితే.. ఇలా కూర్చుంటే మన ఆరోగ్యానికి ముప్పు ఉంటుందట. ఇలా కూర్చోవడం వల్ల రక్తపోటు పెరగడం లాంటి అనేక సమస్యలకు దారి తీస్తుంది అని మనలో చాలా మందికి తెలియదు. కొన్ని అధ్యయనాల ప్రకారం ఎక్కువ సేపు క్రాస్‌ లెగ్ ఫోజులో కూర్చుంటే.. నరాలపై ఒత్తిడి పెరిగి రక్తపోటు పెరుగుతుందని తమ అధ్యయనాల్లో తేలిందని పరిశోధకులు చెబుతున్నారు. రక్తపోటు సమస్యలు లేనివారు కూడా ఈ భంగిమలో ఎక్కువ సేపు కూర్చోరాదు అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎక్కువ కాలం క్రాస్‌ లెగ్‌ ఫోజులో కూర్చోకూడదు అనడానికి మరొక కారణం పక్షవాతం లేదా పెరోనియల్‌ నరాల పక్షవాతం. ఎక్కువ సేపు.. అలా కూర్చునే అలవాటు వల్ల నరాలు అణిగిపోయి దెబ్బతింటాయి. ఫలితంగా నరాల పక్షవాతానికి దారితీస్తాయి. ఒక కాలు మీద మరొక కాలు వేసినప్పుడు గుండె నుంచి పాదాల వరకు రక్త ప్రసరణ సాఫీగా జరుగకపోవడం వల్ల కాళ్లలో ఒక రకమైన మంటగా అనిపిస్తుంది. అలాగే నరాలపై ఒత్తిడి కూడా పెరుగుతుంది. వీటితో పాటు పెల్విక్‌ సమస్యలకు కూడా దారి తీస్తాయి. ఇవన్ని సమస్యలకు చెక్‌ పెట్టాలంటే ఏ స్థితిలో కూర్చున్నా కూడా, ఎక్కువ సేపు ఒకే స్థానంలో కూర్చోకుండా మధ్య మధ్యలో భంగిమలు మారుస్తూ ఉండాలి. అప్పుడు మీరు కూర్చునే విధానం మీ ఆరోగ్యంపై పెద్దగా చూపించకపోగా.. శరీరంలో కదలికల వల్ల మేలు కూడా కలుగుతుందని వైద్యులు చెబుతున్నారు.

Related posts