telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు సినిమా వార్తలు

మరో సాయం చేసిన సోనూసూద్ …

Sonu-Sood

నటుడు సోనూసూద్ ‌మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు. కష్టం ఎక్కడ ఉంటే సోనూసూద్ అక్కడే కనిపిస్తున్నాడు. తాజాగా సోనూసూద్ మరోసారి తన ఉదారత చాటుకున్నాడు. గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న బాలికకు అండగా నిలిచాడు. హైదరాబాద్ నగరంలోని హఫీజ్‌పేటకు చెందిన మారయ్య సరస్వతి దంపతుల కూతురు తేజశ్రీ (12) అనే బాలిక పుట్టినప్పటి నుంచి గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతుంది. బాలిక వైద్య ఖర్చులు, మందుల కోసం ప్రతి నెలా రూ. 20 వేల వరకు ఖర్చు అవుతున్నాయి. ఇప్పటికే లక్షలు ఖర్చుపెట్టిన బాలిక తల్లిదండ్రులు.. ప్రస్తుతం డబ్బులు లేక మందులు కూడా కొనలేని పరిస్థితిలో ఉన్నారు. కాగా.. మొయినాబాద్ మండలంలో ఉన్న జేపీఎల్ కన్వెన్షన్‌లో సోనూసూద్ సినిమా షూటింగ్‌లో ఉన్నాడని తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు శనివారం ఆయనను కలిశారు. తమ బిడ్డకు వైద్యం చేయించే స్థోమత లేదని వారు సోనూసూద్ ముందు తమ గోడును వెల్లబోసుకున్నారు. దాంతో స్పందించిన సోనూసూద్.. బాలిక మందుల కోసం అయ్యే ఖర్చు మొత్తం తానే భరిస్తానని హామీ ఇచ్చాడు. అంతేకాకుండా.. బాలికకు గుండె మార్పిడి చేయాల్సివస్తే ఆపరేషన్‌కు అయ్యే ఖర్చులు కూడా భరిస్తానని తెలిపాడు. కరోనా వైరస్ లాక్ డౌన్ సమయంలో సొంత రాష్ట్రాలకు వెళ్లడానికి డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నవారిని తన సొంత డబ్బులతో బస్సుల్లో వారి స్వగ్రామాలకు పంపిన సోనూసూద్ ఒక్కసారిగా దేశంలో ఆపద్భాందవుడు అయిపోయాడు.

Related posts