telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఈనెల 17న పోలవరం రివర్స్‌ టెండర్‌ నోటిఫికేషన్‌

polavaram

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మాణం చేపట్టిన పోలవరం ప్రాజెక్టు లో మిగిలిన పనులకు పీపీఏ అనుమతితో ఒకే ప్యాకేజీ కింద ఈనెల 17వతేదీన రివర్స్‌ టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. సెప్టెంబరులోగా కొత్త కాంట్రాక్టర్‌ను ఎంపిక చేసి నవంబర్‌ నుంచి శరవేగంగా పనులు చేపట్టి రెండేళ్లలోగా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి, జాతికి అంకితం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. పోలవరం హెడ్‌వర్క్స్‌ గేట్ల పనుల నుంచి వైదొలగాలని ఇప్పటికే పోలవరం సీఈ నుంచి నోటీసులు అందుకున్న బీకెమ్‌ సంస్థ ఇప్పుడు తాము చేస్తున్న ధరల కంటే ఐదు శాతం తక్కువ రేట్లకే పనులు చేస్తామంటూ చేసిన ప్రతిపాదనను ప్రభుత్వం తోసిపుచ్చింది.

నామినేషన్‌పై రూ.387.56 కోట్ల విలువైన గేట్ల పనులు దక్కించుకున్న బీకెమ్‌ తాజాగా రూ.368.19 కోట్లకే చేస్తామని ప్రతిపాదించింది. తద్వారా గేట్ల పనుల్లో అవినీతి జరిగినట్లుగా బీకెమ్‌ పరోక్షంగా అంగీకరించినట్లయిందని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి.టీడీపీ హయాంలో ఇంజనీరింగ్‌ పనుల్లో జరిగిన అక్రమాలను వెలికి తీసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిపుణుల కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. పోలవరం పనులపై విచారించిన నిపుణుల కమిటీ రూ.3,128.31 కోట్ల మేర అవినీతి జరిగినట్లుగా నిర్థారించింది. ఈ నేపథ్యంలో నిపుణుల కమిటీ సిఫార్సు మేరకు రివర్స్‌ టెండరింగ్‌కు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది.

Related posts