telugu navyamedia
సినిమా వార్తలు

“అవెంజర్స్” మొదటిరోజు కలెక్షన్స్

Avengers-4

ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులంతా ఎంతో ఆతృతగా ఎదురుచూసిన “ఎవెంజర్స్: ది ఎండ్ గేమ్” సినిమా నిన్న విడుదలైంది. వరల్డ్ వైడ్ గా ఈ సినిమా ఓపెనింగ్స్ లో సరికొత్త రికార్డ్స్ నెలకొల్పింది. శుక్రవారం విడుదలయిన ఈ సినిమా కొన్ని ఆసియా దేశాల్లో రెండు రోజుల ముందుగానే విడుదలైంది. చైనాలో ఈ సినిమాను భారీ ఎత్తున విడుదల చేశారు. తొలిరోజు ఈ సినిమా అక్కడ రూ.750 కోట్లు వసూళ్లు సాధించి సంచలనం సృష్టించింది. ఇప్పటికవరకు చైనాలో ఏ సినిమా కూడా ఇంతటి వసూళ్లను రాబట్టలేదు. అక్కడ దేశవ్యాప్తంగా లక్షకు పైగా థియేటర్లు ఉన్నాయి. “ఎవెంజర్స్” సినిమాను సగం థియేటర్లలోనే విడుదల చేశారు. అయినప్పటికీ ఈ సినిమా రూ.750 కోట్లు సాధించడంతో డిస్ట్రిబ్యూటర్లు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక లాంగ్ రన్ లో ఈ సినిమా ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తుందో చూడాలి. ఇండియాలో కూడా ఈ సినిమాకు ఉన్న క్రేజ్ తో రూ.500 కోట్లు వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు.

Related posts