telugu navyamedia
సినిమా వార్తలు

మరోసారి తెరపైకి టాలీవుడ్ డ్రగ్స్ కేసు..

నాలుగేళ్ల క్రితం సంచలనం రేపిన టాలీవుడ్ డ్రగ్స్ కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ డ్రగ్స్ కేసులో మరోసారి పూరీ జగన్నాథ్, రానా దగ్గుబాటి, హీరో రవితేజ, రకుల్ ప్రీత్ సింగ్, తో పాటు మొత్తం 12 మందిని ఈడీ విచారించనుంది. మళ్లీ ఈ కేసు వేగం అందుకోవటం టాలీవుడ్ లో సంచలనం రేపుతుంది.

Prominent Telugu director Puri Jagannadh questioned by SIT in Hyderabad drug racket case | The News Minute

ఈ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ఈడీ మళ్లీ డ్రగ్స్ కేసులో ఉన్నవారిని విచారించనుంది. ఇందులో భాగంగా పురీ జగన్నాథ్ రానా దగ్గుబాటి, హీరో రవితేజ, రకుల్ ప్రీత్ సింగ్, తరుణ్‌ , తనీష్‌ నందు , ముమైత్‌ ఖాన్‌ , చార్మీ కౌర్‌నవ్‌దీప్ తో పాటు హీరో రవితేజ డ్రైవర్, ఎఫ్‌–క్లబ్‌ జనరల్‌ మేనేజర్‌… మొత్తం 12 మందికి బుధవారం ఎక్సైజ్‌ శాఖనోటిసులు పంపింది.

నాలుగేళ్ల క్రితం హైదరాబాద్​లో ఎక్సైజ్ అధికారులకు చిక్కిన కొందరు డ్రగ్స్ విక్రేతల విచారణలో పలువురు సినీ ప్రముఖుల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. సినీ ప్రముఖులను ఎక్సైజ్ అధికారులు సుదీర్ఘ విచారణ జరిపారు. రక్తం, గోళ్లు, వెంట్రుకల శాంపిల్స్ సేకరించి లేబొరేటీలకు పంపించారు. అప్పుడు సినీ ప్రముఖులకు క్లీన్ చిట్ ఇచ్చిన ఎక్సైజ్ అధికారులు.. పలువురు డ్రగ్స్ విక్రేతలపై 12 ఛార్జ్ షీట్లను దాఖలు చేశారు.

Actress Charmi Kaur Saree Photos @ Meeku Maathrame Cheptha Pre Release - South Indian Actress

అయితే, ఈ డ్రగ్స్ కేసును సీబీఐ, నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో, ఈడీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలకు అప్పగించాలని గతంలో రేవంత్ రెడ్డి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. విచారణ సందర్భంగా ఈడీ కేసును విచారణ జరిపేందుకు సిద్ధంగా ఉన్నామని.. ఎక్సైజ్ అధికారుల నుంచి వివరాలు అందడం లేదని ఈడీ ఆరోపించింది. చివరకు ఎక్సైజ్ శాఖ కేసుల ఆధారంగా డ్రగ్స్ కేసులపై మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఈడీ కేసు నమోదు చేసి రంగంలోకి దిగింది. డ్రగ్స్ కేసులో విచారణకు హాజరు కావాలని పలువురు సినీ ప్రముఖులను ఈడీ సమన్లు జారీ చేసింది.

Rakul Preet Singh recalls her time as a newbie on the sets of Gilli and Yaariyan

 

విచారణ తేదీలు మరియు ప్రముఖులు
ఈనెల 31న పూరీ జగన్నాథ్, సెప్టెంబరు 2న చార్మి, 6న రకుల్ ప్రీత్ సింగ్, 8న రానా దగ్గుపాటి, 9న రవితేజ శ్రీనివాస్, 13న నవదీప్, ఎఫ్-క్లబ్ జనరల్ మేనేజర్, 15న ముమైత్ ఖాన్, 17న తనీష్, 20న నందు, 22న తరుణ్ హాజరు కావాలని సమన్లు జారీ చేసింది. హైదరాబాద్​లోని ఈడీ కార్యాలయంలో సినీ ప్రముఖులతో పాటు.. డ్రగ్స్ విక్రేతలను ఈడీ బృందాలు ప్రశ్నించనున్నాయి.

Rakul Preet Singh, Rana Daggubati and others summoned by ED in drugs case | Hindi Movie News - Times of India

వీరిని ఈ నెల 31 నుండి సెప్టెంబర్‌ 22 వరకు ఈడీ విచారించనుంది. అయితే ఇందులో రకుల్‌, రానా, రవిజేత పూరీని నిందితులుగా చేర్చలేదని మాదకద్రవ్యాల క్రయవిక్రయాలకు సంబందించిన మనీలాండరింగ్‌లో వీరి ప్రమేయం ఉందని చెప్పడం తొందరపాటే అవుతుందని ఈడీ అధికారులు పేర్కొన్నారు. నేరానికి చెందిన ఆధారాలు లభించే వరకు అందరిని సాక్షులుగా పరిగణిస్తామని వెల్లడించారు. ఈ కేసును తెలంగాణ క్సైజ్‌ శాఖ ఆధ్వర్యంలోని సిట్‌ దర్యాప్తు చేస్తోంది. కోర్టులో చార్జ్ షీట్ కూడా దాఖలు చేసినప్పటికీ ఈడీ రంగంలోకి దిగటం చర్చనీయాంశంగా మారింది.

Related posts