telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

అక్కా వాళ్లు నన్ను చంపేస్తారేమో?… సుశాంత్ SOS మెసేజ్ వైరల్

Sushanth

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ అనుమానాస్పదంగా మృతి చెంది ఇప్పటికే మూడు నెలలు గడుస్తున్నా సస్పెన్స్ గానే ఉంది. ఈ కేసు రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. ప్రస్తుతం ఈ కేసు పూర్తిగా డ్రగ్స్ వైపు మళ్లింది. సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తిని ముంబై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు అరెస్ట్ చేశారు. మరోవైపు సీబీఐ ఇన్వెస్టిగేషన్‌లో రియాను నిందితురాలుగా చేర్చి విచారణ జరుపుతున్నారు. డ్రగ్స్ కేసులో పలువురు ప్రముఖుల పేర్లు రావడం బాలీవుడ్ లో సంచలనంగా మారింది. తాజాగా సుశాంత్ చనిపోయే ముందు తన సోదరి మీతూ సింగ్‌కు పంపిన ఓ SOS వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఇది జాతీయ మీడియాలో సంచలన సృష్టిస్తోంది. జాతీయ మీడియాలో వస్తున్న కథనం ప్రకారం.. సరిగ్గా మరణానికి ఐదు రోజుల ముందు తన సోదరి మీతూ సింగ్‌కు సుశాంత్ ఓ SOS పంపించాడు. “అక్కా భయమేస్తోంది. వాళ్లు నన్ను చంపేస్తారేమో? అని అనుమానంగా ఉంది. వాళ్లు నన్ను ఏదో ఒక దానిలో ఇరుక్కునేలా చేస్తారు. ఈ సమయంలో నీతో మాట్లాడాలనుకుంటున్నా” అనే మెసేజ్ పంపాడు. ఇక సుశాంత్ మరణించిన మూడు నెలల తర్వాత ఈ SOS వెలుగులోకి వచ్చింది. ఆ సమయంలో సుశాంత్‌ ఎవరు చంపేస్తారని భయపడ్డాడు? అసలేం జరిగింది అనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఈ కేసు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.

Related posts