telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

అది బోల్డ్‌నెస్సా…? రకుల్ ఫైర్

Rakul-PReeth-Singh

రాహుల్ రవీంద్రన్‌ దర్శకత్వంలో కింగ్ నాగార్జున హీరోగా తెరకెక్కిన‌ తాజా చిత్రం “మన్మథుడు-2”. ఈ చిత్రంలో నాగ్‌ సరసన రకుల్ ప్రీత్‌ సింగ్ హీరోయిన్‌గా నటించింది. ఇప్ప‌టికే విడుద‌లైన‌ టీజ‌ర్‌లు సినిమాపై హైప్ పెంచేశాయి. ఈ సినిమాలో హీరోయిన్లు స‌మంత‌, కీర్తి సురేష్ ప్ర‌త్యేక పాత్ర‌ల్లో న‌టించారు. ల‌క్ష్మి, రావు ర‌మేష్‌, వెన్నెల కిషోర్‌, ఝాన్సీ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించనున్నారు. ఆగస్టు 9న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇటీవల ఈ సినిమా నుంచి విడుదల చేసిన ట్రైల‌ర్‌ కు మంచి స్పందన వచ్చింది. ఈ ట్రైల‌ర్‌లో కూడా లిప్‌లాక్ స‌న్నివేశాల‌ను చూపించారు. ఈ సినిమాకు తాజాగా సెన్సార్ కంప్లీటైంది. సెన్సార్ వాళ్లు ఈ సినిమాకు U/A సర్టిఫికేట్ జారీ చేసారు. సినిమా ప్రమోషన్లలో భాగంగా రకుల్ తాజాగా ఓ ఇంటర్వ్యూ ఇచ్చింది. ఇందులో భాగంగా ఓ రిపోర్టర్ “సినిమాలో కాస్త బోల్డ్ గా నటించినట్లున్నారు…” అని ప్రశ్నించగా.. వెంటనే రకుల్ “మీరు.. దేని గురించి అడుగుతున్నారో నాకు తెలుసు” అంటూ ఫైర్ అయ్యింది. ఆమె మాట్లాడుతూ ”ఈ సినిమాలో సిగ‌రెట్ తాగిన సీన్ ఉంది. దాని కోస‌మే క‌దా? సిగ‌రెట్లు తాగితే బోల్డ్‌నెస్ అయిపోతుందా? అవంతిక అనే అమ్మాయి సిగ‌రెట్లు తాగ‌డం గురించిన క‌థ కాదిది. సిగ‌రెట్లు తాగే అల‌వాటున్న అవంతిక క‌థ ఇది. అయినా హీరోలు సిగ‌రెట్ తాగితే త‌ప్పు లేదు కానీ, హీరోయిన్లు కాలిస్తే త‌ప్పొచ్చిందా? బ‌య‌ట స‌మాజంలో, రోడ్డు మీద ఇంకా చాలా చాలా విష‌యాలే జ‌రుగుతున్నాయి. వాటి గురించి ఎవ్వ‌రూ మాట్లాడ‌రు. సినిమాలో కాస్త బోల్డ్‌నెస్ చూపించ‌గానే సంస్క్రృతి, సంప్ర‌దాయాలు గుర్తొస్తాయి. సినిమాల ద్వారా చెడు అల‌వాట్ల‌ని ప్రోత్స‌హించ‌డం లేదు. అలాంటి స‌న్నివేశాలు వ‌స్తున్న‌ప్పుడు మ‌ద్య‌పానం, ధూమ‌పానం హానిక‌రం అని స్లైడింగ్ కూడా వేస్తున్నాం క‌దా?” అంటూ మండిపడింది.

Related posts