రెండు దశాబ్దాల రాజకీయ శత్రుత్వాన్ని పక్కన పెట్టారు ఇద్దరు నేతలు. అయితే అది నచ్చని వారు కూడా ఉంటారు అనేది ఒప్పుకోవాల్సిన నిజం. దీనితో వారి కలయిక, వ్యతిరేకుల వీడ్కోలుకు తలుపులు తెరిచినట్టే ఉంది. అలాగే ఇది చూసి, ఓటమి తప్పదన్న వాళ్ళు కూడా ఈ కూటమిలో కలిసేందుకు సిద్ధం అవుతున్నారు.
తాజాగా ఉత్తర్‌ప్రదేశ్‌లో అధికార భారతీయ జనతా పార్టీ(బీజేపీ)కి పెద్ద ఎదురుదెబ్బ తగలింది. ఆ పార్టీ సిట్టింగ్ ఎంపీ రామ్ చరిత్ర నిషాద్ సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ)లో చేరారు. రామ్ చరిత్ర మచ్లిషాహర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇవాళ లక్నోలో ఎస్పీ కార్యాలయంలో పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ సమక్షంలో సమాజ్‌వాదీ పార్టీలో చేరారు.